Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Pachchagaddi koseti / పచ్చగడ్డి కోసేటి

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
gOpi:  paccagaDDi kOsETi paDucupillOy
nI  paiTakoMgu jAriMdE gaDusu pillA.......  ||paccagaDDi||
rAdha:  koMgu  jAritEmuMdi gaDusu pillODA    
nI guMDe cikkukuMdEmO cUDu bullODA ||koMgu||
gOpi:  koppulOna baMtipUlu gunustunnavI
ceppalEni vUsulE  cepputunnavI
rAdha:  vUsulannI viMTivA vUrukOvanI
ASalai, bAsalai aMTukoMTavi..... gOpi:  ||paccagaDDi||
gOpi:  varicEnu  kOtakocci vaMgutunnadi
vaMpulannI vayasocci poMgutunnavi
rAdha:  vayasu tOTi manasEmO pOrutunnadi
valapulO reMDiTiki oddikunnadi ........gOpi:   ||paccagaDDi||
gOpi:  koDavalitO lEta gaDDi kOsukoMTivi
koMTe cUputO _ guMDe dUsukoMTivi.........
rAdha:   gaDDimOpu talapaina mOsukostini
gaDusuvADni talapullO dAcukoMTini
gOpi:    paccagaDDi kOsETi paDucupillOy
nI  paiTakoMgu jAriMdE gaDusu pillA.......
rAdha:  koMgu  jAritEmuMdi gaDusu pillODA    
nI guMDe cikkukuMdEmO cUDu bullODA
 
Click here to hear the song
గోపి:  పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ  పైటకొంగు జారిందే గడుసు పిల్లా.......  ||పచ్చగడ్డి||
రాధ:  కొంగు  జారితేముంది గడుసు పిల్లోడా    
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా ||కొంగు||
గోపి:  కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ
చెప్పలేని వూసులే  చెప్పుతున్నవీ
రాధ:  వూసులన్నీ వింటివా వూరుకోవనీ
ఆశలై, బాసలై అంటుకొంటవి..... గోపి:  ||పచ్చగడ్డి||
గోపి:  వరిచేను  కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
రాధ:  వయసు తోటి మనసేమో పోరుతున్నది
వలపులో రెండిటికి ఒద్దికున్నది ........గోపి:   ||పచ్చగడ్డి||
గోపి:  కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో _ గుండె దూసుకొంటివి.........
రాధ:   గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని
గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని
గోపి:    పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్
నీ  పైటకొంగు జారిందే గడుసు పిల్లా.......
రాధ:  కొంగు  జారితేముంది గడుసు పిల్లోడా    
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment