Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Oho oho pavurama / ఓహో ఓహో పావురమా

Song Details:Actor :Actress : Savithri / సావిత్రి ,  Shavukaru Janaki / షావుకారు జానకి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
oho.. oho..  
 
oho.. oho paavuramaa - vayyaari paavuramaa 

maavaari andaalu neevaina telupamaa 
maavaari andaalu neevaina telupamaa        ||oho.|| 
manasu madhuramainadi - mamathalu nindinadi 
sogasu neneruganidi - choodaalani vunnadi 
aruvuga nee kanulu - karunatho ivvagalavaa ? 
aruvuga nee kanulu - karunatho ivvagalavaa ? 
karuvu teera okkasaari kaanthunamma vaarinee.. 
oho.. oho..                  ||oho.|| 
valapu kanna teeyani - palukulu vaarivi 
thaluchukunna chaalunu - pulaka rinchu naa menu 
magasiri dorayani- maruvani sariyani 
magasiri dorayani- maruvani sariyani 
andaru andu re - antha andamaina vaaraa.. 
oho.. oho..                  ||oho.|| 
andari kannulu - ayyagaarimeedane 
dishti thagala galadanee - telipiramma kondaru 
annadi nijamenaa ? allina kathalenaa ? 
annadi nijamenaa ? allina kathalenaa ? 
kannulunna neevainaa vunnamaata cheppumaa... 
oho.. oho..                  ||oho.|| 
 
Click here to hear the song
ఓహో.. ఓహో..  
 
ఓహో.. ఓహో పావురమా - వయ్యారి పావురమా 

మావారి అందాలు నీవైన తెలుపమా 
మావారి అందాలు నీవైన తెలుపమా        ||ఓహో.|| 
మనసు మధురమైనది - మమతలు నిండినది 
సొగసు నెనెరుగనిది - చూడాలని ఉన్నది 
అరువుగ నీ కనులు - కరుణతో ఇవ్వగలవా ? 
అరువుగ నీ కనులు - కరుణతో ఇవ్వగలవా ? 
కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ.. 
ఓహో.. ఓహో..                  ||ఓహో.|| 
వలపు కన్న తీయని - పలుకులు వారివి 
తలుచుకున్న చాలును - పులక రించు నా మేను 
మగసిరి దొరయని- మరువని సరియని 
మగసిరి దొరయని- మరువని సరియని 
అందరు అందు రే - అంత అందమైన వారా.. 
ఓహో.. ఓహో..                  ||ఓహో.|| 
అందరి కన్నులు - అయ్యగారిమీదనే 
దిష్టి తగల గలదనీ - తెలిపిరమ్మ కొందరు 
అన్నది నిజమేనా ? అల్లిన కథలేనా ? 
అన్నది నిజమేనా ? అల్లిన కథలేనా ? 
కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా... 
ఓహో.. ఓహో..                  ||ఓహో.|| 
 
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment