Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nenu Puttanu / నేను పుట్టాను

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
kaLyAN : nEnu puTTAnu lOkaM mecciMdi

    nEnu navvAnu I lOkaM EDciMdi

    nAkiMkA lOkaMtO pani EmuMdi.. DOnT kEr    //nEnu//

    nEnu tAgitE.. koMdari kaLLu gira gira tirigAyi

    nEnu pADitE... aMdari nOLLU vaMtalu pADAyi

    nEnu ADitE.. aMdari kALLU nAtO kaliSAyi

    tellavAritE venakana cEri navvukuMTAyi... DOnT kEr    //nEnu//

    manasunu dAcETaMdukE pai pai navvulu vunnAyi

    maniShiki lEni aMdaM kOsamE raMgulu vunnAyi

    eragaka nammina vALLa nettikE cEtulu vastAyi

    eduTi maniShiki ceppETaMdukE

    nItulu vunnAyi... DOnT kEr    //nEnu//

    maniShini maniShini kalipETaMdukE pedavulu vunnAyi

    pedavulu madhuraM cEsETaMdukE madhuvulu vunnAyi

    bAdhalannI bATillO nEDE diMpESey

    aggipulla gIcESey  nIlO saitAn tarimESey...

    Draiv di Devil avuT... //nEnu//
కళ్యాణ్ : నేను పుట్టాను లోకం మెచ్చింది

    నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది

    నాకింకా లోకంతో పని ఏముంది.. డోన్ట్ కేర్    //నేను//

    నేను తాగితే.. కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి

    నేను పాడితే... అందరి నోళ్ళూ వంతలు పాడాయి

    నేను ఆడితే.. అందరి కాళ్ళూ నాతో కలిశాయి

    తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి... డోన్ట్ కేర్    //నేను//

    మనసును దాచేటందుకే పై పై నవ్వులు వున్నాయి

    మనిషికి లేని అందం కోసమే రంగులు వున్నాయి

    ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి

    ఎదుటి మనిషికి చెప్పేటందుకే

    నీతులు వున్నాయి... డోన్ట్ కేర్    //నేను//

    మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు వున్నాయి

    పెదవులు మధురం చేసేటందుకే మధువులు వున్నాయి

    బాధలన్నీ బాటిల్లో నేడే దింపేశెయ్

    అగ్గిపుల్ల గీచేశెయ్  నీలో సైతాన్ తరిమేశెయ్...

    డ్రైవ్ ది డెవిల్ అవుట్... //నేను//

0 comments:

Post a Comment