Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nelala Kannullo / నీలాల కన్నుల్లో

Song Details:Actor : Nagabhushanam / నాగభూషణం  ,Actress : Kanchana / కాంచన  ,Music Director : G.K.Venkatesh / జి.కె.వెంకటేశ్ ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 neelaala kannullO melamellagaa

 nidura raavammaa raavae... niMDaaraa raavae

 nelavaMka chaluvallu vedajallagaa

 nidura raavammaa raavaenemmadigaa raavae

IIneelaalaII



 charaNaM : 1

 O O O... chirugaali baala paaDiMdi jOla paaDiMdee jOla

 chiguraaku manasu kanupaapalaMdu

 edadOchenammaa aevevO kalalu

 kalalannee kaLalennO virabooyagaa

 nidura raavammaa raavae... nemmadigaa raavae

IIneelaalaII



 charaNaM : 2

 O O O... niduramma oDilO origiMdi raeyi oogiMdee laalee

 gaganaanni choosi oka kannudOyi vinipiMchamaMdi ennennO kathalu

 katha cheppi muripiMchi marapiMchagaa

 nidura raavammaa raavae... nemmadigaa raavae

IIneelaalaII





Click here to hear the song
పల్లవి :

 నీలాల కన్నుల్లో మెలమెల్లగా

 నిదుర రావమ్మా రావే... నిండారా రావే

 నెలవంక చలువల్లు వెదజల్లగా

 నిదుర రావమ్మా రావేనెమ్మదిగా రావే

 ॥నీలాల॥



 చరణం : 1

 ఓ ఓ ఓ... చిరుగాలి బాల పాడింది జోల పాడిందీ జోల

 చిగురాకు మనసు కనుపాపలందు

 ఎదదోచెనమ్మా ఏవెవో కలలు

 కలలన్నీ కళలెన్నో విరబూయగా

 నిదుర రావమ్మా రావే... నెమ్మదిగా రావే

 ॥నీలాల॥



 చరణం : 2

 ఓ ఓ ఓ... నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగిందీ లాలీ

 గగనాన్ని చూసి ఒక కన్నుదోయి వినిపించమంది ఎన్నెన్నో కథలు

 కథ చెప్పి మురిపించి మరపించగా

 నిదుర రావమ్మా రావే... నెమ్మదిగా రావే

 ॥నీలాల॥


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment