Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nee Sukamene Koruthunna / నీ సుఖమే నే కోరుకున్నా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Jamuna / జమున ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

ekkaDa unnA EmainA

manamevariki vArai vErainA

nI suKamE nEnu kOrukunnA

ninu vIDi aMdukE veLutunnA

nI suKamE nE kOrukunnA
caraNaM :

anukunnAmani jaragavu annI 

anukOlEdanI Agavu konni

jarigEvannI maMcikanI 

anukOvaDamE maniShi panI..

nI suKamE nEnu kOrukunnA

ninu vIDi aMdukE veLutunnA

nI suKamE nE kOrukunnA
caraNaM :

pasipApavale oDi cErinAnu 

kanupApavale kApADinAnu

guMDenu guDigA cESAnU 

guMDenu guDigA cESAnU

nuvvuMDa lEnanI veLlAvu

nI suKamE nEnu kOrukunnA

ninu vIDi aMdukE veLutunnA

nI suKamE nE kOrukunnA
caraNaM:

valacuTa telisina nA manasunaku 

maracuTa mAtraM teliyanidA

manasiccinadE nijamaitE 

manniMcuTayE Rujuvu kadA!

nI suKamE nEnu kOrukunnA

ninu vIDi aMdukE veLutunnA

nI suKamE nE kOrukunnA
nI kalalE kammagA paMDanI 

nAtalapE nIlO vADanI

kalakAlaM callagA uMDAlanI 

dIvistunnA nA dEvini

dIvistunnA nA dEvini
ekkaDa unnA EmainA 

manamevariki vArai vErainA

nI suKamE nEnu kOrukunnA 

ninu vIDi aMdukE veLutunnA

nI suKamE nE kOrukunnA

nI suKamE nEnu kOrukunnA..
 
Click here to hear the song
పల్లవి :

ఎక్కడ ఉన్నా ఏమైనా

మనమెవరికి వారై వేరైనా

నీ సుఖమే నేను కోరుకున్నా

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుకున్నా
చరణం :

అనుకున్నామని జరగవు అన్నీ 

అనుకోలేదనీ ఆగవు కొన్ని

జరిగేవన్నీ మంచికనీ 

అనుకోవడమే మనిషి పనీ..

నీ సుఖమే నేను కోరుకున్నా

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుకున్నా
చరణం :

పసిపాపవలె ఒడి చేరినాను 

కనుపాపవలె కాపాడినాను

గుండెను గుడిగా చేశానూ 

గుండెను గుడిగా చేశానూ

నువ్వుండ లేననీ వెళ్లావు

నీ సుఖమే నేను కోరుకున్నా

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుకున్నా
చరణం:

వలచుట తెలిసిన నా మనసునకు 

మరచుట మాత్రం తెలియనిదా

మనసిచ్చినదే నిజమైతే 

మన్నించుటయే ఋజువు కదా!

నీ సుఖమే నేను కోరుకున్నా

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుకున్నా
నీ కలలే కమ్మగా పండనీ 

నాతలపే నీలో వాడనీ

కలకాలం చల్లగా ఉండాలనీ 

దీవిస్తున్నా నా దేవిని

దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ ఉన్నా ఏమైనా 

మనమెవరికి వారై వేరైనా

నీ సుఖమే నేను కోరుకున్నా 

నిను వీడి అందుకే వెళుతున్నా

నీ సుఖమే నే కోరుకున్నా

నీ సుఖమే నేను కోరుకున్నా..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment