Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nallavade (Sad version) / నల్లవాడే...

Song Details:Actor :Actress : Chandrakala / చంద్రకళ ,  Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
Adha:   nallavADE...  ammamma...  allari pillavADE
nirmala:  cinnavADE... Oyamma... rAdhakE cikkanADE
rAdha:  lEdamma lEdu... rukmiNikE dakkinADE                   || nallavADE||
nirmala:  vennavaMTi manasunna cinnavADE
rAdha:  cinnanATi nuMDi nuvvukOrukunnavADE...
nirmala:  prEmakE bAnisai pOtADE
rAdha:   kAdamma...    BaktikE dAsuDai vuMTADE    ||nallavADE||
rAdha:  nuvvu vAvi varasa vunnadAnivi
nirmala:  nuvvu valapu dOcukunna dAnivi
manasicci mATa puccukoMTivi
nI manasicci mATa puccukoMTivi
rAdha:   maMcitanamutO  nuvvu  gelucukoMTivI          ||nallavADE||
rAdhAkRuShNulu kadhalEnammA vAru ennaDU Alumagalu kAlEdammA
nirmala:  rAdhAkRuShNula  prEmE pavitramu lOkAnikE adi AdarSamu
rAdha: gOpAla bAluDU
nirmala:   nI prEma lOluDU  _  gOpAla kRuShNuDU     
rAdha: nIpAli dEvuDu
nirmala:  vADu nI vADE
rAdha:   kAdu nI vADE
nirmala:  kAdu nI vADE
rAdha:  kADu kADu _ kAnE kA DE
nirmala:  nallavADE... ammamma allari pillavADE
 
Click here to hear the song
రాధ:   నల్లవాడే...  అమ్మమ్మ...  అల్లరి పిల్లవాడే
నిర్మల:  చిన్నవాడే... ఓయమ్మ... రాధకే చిక్కనాడే
రాధ:  లేదమ్మ లేదు... రుక్మిణికే దక్కినాడే                   || నల్లవాడే||
నిర్మల:  వెన్నవంటి మనసున్న చిన్నవాడే
రాధ:  చిన్ననాటి నుండి నువ్వుకోరుకున్నవాడే...
నిర్మల:  ప్రేమకే బానిసై పోతాడే
రాధ:   కాదమ్మ...    భక్తికే దాసుడై వుంటాడే    ||నల్లవాడే||
రాధ:  నువ్వు వావి వరస వున్నదానివి
నిర్మల:  నువ్వు వలపు దోచుకున్న దానివి
మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివి
రాధ:   మంచితనముతో  నువ్వు  గెలుచుకొంటివీ          ||నల్లవాడే||
రాధాకృష్ణులు కధలేనమ్మా వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
నిర్మల:  రాధాకృష్ణుల  ప్రేమే పవిత్రము లోకానికే అది ఆదర్శము
రాధ: గోపాల బాలుడూ
నిర్మల:   నీ ప్రేమ లోలుడూ  _  గోపాల కృష్ణుడూ     
రాధ: నీపాలి దేవుడు
నిర్మల:  వాడు నీ వాడే
రాధ:   కాదు నీ వాడే
నిర్మల:  కాదు నీ వాడే
రాధ:  కాడు కాడు _ కానే కా డే
నిర్మల:  నల్లవాడే... అమ్మమ్మ అల్లరి పిల్లవాడే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment