Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Manasuleni / మనసులేని

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Sad & Patho songs
manasulEni bratukoka narakaM

maravalEni manasoka narakaM



manasulEni bratukoka narakaM

maravalEni manasoka narakaM



maniShikekkaDa vunnadi swargaM

maraNamEnaa daaniki maargaM!?



manasulEni bratukoka narakaM



manasanEdi okarikokaru iccinapuDE telisEdi

daacukuMTE evarikI adi dakkakuMDaa pOtuMdi

prEmanEdi nIku nIvE peMcukuMTE perigEdi

paMcukunE oka manasuMTEnE oka baMdamai adi nilicEdi



manasulEni bratukoka narakaM



tarumukoccE jnaapakaalu..edanu guccE gulaabi muLLu

gurututeccE aMdaalu..kUlipOyina shilpaalu

kannu nIdani.vElu nIdani..poDucukuMTE raadaa raktaM

raktameMtagaa dhaarapOsinaa dorukutuMdaa maLLI hRudayaM



manasulEni bratukoka narakaM

maravalEni manasoka narakaM



maniShikekkaDa vunnadi swargaM

maraNamEnaa daaniki maargaM!?



manasulEni bratukoka narakaM
మనసులేని బ్రతుకొక నరకం

మరవలేని మనసొక నరకం



మనసులేని బ్రతుకొక నరకం

మరవలేని మనసొక నరకం



మనిషికెక్కడ వున్నది స్వర్గం

మరణమేనా దానికి మార్గం!?



మనసులేని బ్రతుకొక నరకం



మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది

దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది

ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది

పంచుకునే ఒక మనసుంటేనే ఒక బందమై అది నిలిచేది



మనసులేని బ్రతుకొక నరకం



తరుముకొచ్చే జ్నాపకాలు..ఎదను గుచ్చే గులాబి ముళ్ళు

గురుతుతెచ్చే అందాలు..కూలిపోయిన శిల్పాలు

కన్ను నీదని.వేలు నీదని..పొడుచుకుంటే రాదా రక్తం

రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం



మనసులేని బ్రతుకొక నరకం

మరవలేని మనసొక నరకం



మనిషికెక్కడ వున్నది స్వర్గం

మరణమేనా దానికి మార్గం!?



మనసులేని బ్రతుకొక నరకం

0 comments:

Post a Comment