Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Mallepandiri Nidalona / మల్లెపందిరి నీడలోన

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Manjula / మంజుల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
mallepaMdiri nIDalOna jaabilli..
maMcamEsi vuMcinaanu jaabilli..
 
mallepaMdiri nIDalOna jaabilli..
maMcamEsi vuMcinaanu jaabilli..
 
maa annaku maa caMdriki idi tolirEyi..
naakidi varamOyi!!
kaLLukuTTi veLLakOyi jaabilli..
tellavaaranIyakOyi I rEyi!!
 
gaDusu pillaku vayasu nEDE gurutukocciMdI..
moraTuvaani manasu daaniki pulakariMciMdI..
gaDusu pillaku vayasu nEDE gurutukocciMdI..
moraTuvaani manasu daaniki pulakariMciMdI..
 
iddariki InaaDu nuvvE muddu nErpaali..
aa muddu cUsi cukkalE ninu vekkiriMcaali!!
 
kaLLukuTTi veLLakOyi jaabilli..
tellavaaranIyakOyi I rEyi!!
 
peLLisaMbaramennaDeragani illu naadI..
pasuputaaDE nOcukOni bratuku naadI..
peLLisaMbaramennaDeragani illu naadI..
pasuputaaDE nOcukOni bratuku naadI..
 
I peLLi cEsi nEnu kUDaa muttaiduvainaanu..
I puNNemE pai janmalO nanu illaalini cEyaali!!
 
kaLLukuTTi veLLakOyi jaabilli..
tellavaaranIyakOyi I rEyi!!
 
mallepaMdiri nIDalOna jaabilli..
maMcamEsi vuMcinaanu jaabilli..
 
maa annaku maa caMdriki idi tolirEyi..
naakidi varamOyi!!
kaLLukuTTi veLLakOyi jaabilli..
tellavaaranIyakOyi I rEyi!!
 
Uhu Uhu Uhu Uhu Uhuhu..
Uhu Uhu Uhu Uhu Uhuhu..
 
 
Click here to hear the song
మల్లెపందిరి నీడలోన జాబిల్లి..
మంచమేసి వుంచినాను జాబిల్లి..
 
మల్లెపందిరి నీడలోన జాబిల్లి..
మంచమేసి వుంచినాను జాబిల్లి..
 
మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరేయి..
నాకిది వరమోయి!!
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి..
తెల్లవారనీయకోయి ఈ రేయి!!
 
గడుసు పిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ..
మొరటువాని మనసు దానికి పులకరించిందీ..
గడుసు పిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ..
మొరటువాని మనసు దానికి పులకరించిందీ..
 
ఇద్దరికి ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి..
ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి!!
 
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి..
తెల్లవారనీయకోయి ఈ రేయి!!
 
పెళ్ళిసంబరమెన్నడెరగని ఇల్లు నాదీ..
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..
పెళ్ళిసంబరమెన్నడెరగని ఇల్లు నాదీ..
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..
 
ఈ పెళ్ళి చేసి నేను కూడా ముత్తైదువైనాను..
ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి!!
 
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి..
తెల్లవారనీయకోయి ఈ రేయి!!
 
మల్లెపందిరి నీడలోన జాబిల్లి..
మంచమేసి వుంచినాను జాబిల్లి..
 
మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరేయి..
నాకిది వరమోయి!!
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి..
తెల్లవారనీయకోయి ఈ రేయి!!
 
ఊహు ఊహు ఊహు ఊహు ఊహుహు..
ఊహు ఊహు ఊహు ఊహు ఊహుహు..
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment