Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Kotta pellikuturaa / కొత్త పెళ్ళికూతురా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Jamuna raani / జమునా రాణి ,  L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
kottapeLLikUturA  rA rA
nI kuDikAlu muMdu mOpi rA rA 
guNavati kulasati   rA  rA                  ||kotta||
kalimiki kANAci nI puTTinillu
celimiki mAgANi nuvu meTTinillu
dhanamunnadi balamunnadi nI iMTa
manasunnadi mamatunnadi mA iMTa   ||kotta||
pai merugulu paiDi nagalu lEvu ikkaDa
paMtAlu sAdhiMpulu rAvu ikkaDa
niMDumanasu cirunagavu paMDu nikkaDa_A
paMDuvennelaMdu dinaM paMDugikkaDa    ||kotta||
kannatalli kanna minna nI atagAru 
kanipiMcEnu daivamu cEkonnavADu
kalalannI nijamau nI kApurAna
kalakAlaM velugu nI  iMTidIpamu         ||kotta||
కొత్తపెళ్ళికూతురా  రా రా
నీ కుడికాలు ముందు మోపి రా రా 
గుణవతి కులసతి   రా  రా                  ||కొత్త||
కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు
చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు
ధనమున్నది బలమున్నది నీ ఇంట
మనసున్నది మమతున్నది మా ఇంట   ||కొత్త||
పై మెరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ
నిండుమనసు చిరునగవు పండు నిక్కడ_ఆ
పండువెన్నెలందు దినం పండుగిక్కడ    ||కొత్త||
కన్నతల్లి కన్న మిన్న నీ అతగారు 
కనిపించేను దైవము చేకొన్నవాడు
కలలన్నీ నిజమౌ నీ కాపురాన
కలకాలం వెలుగు నీ  ఇంటిదీపము         ||కొత్త||

0 comments:

Post a Comment