Song » Kalyana Vaibhavameenaade / కళ్యాణ వైభవమీనాడే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
P. Leela / పి. లీల ,Song Category : Others
kaLyANa vaiBavamInADE celi kaLyANa vaiBava mInADE mana padmAvatI SrInivAsula kaLyANa cUtamu rArE sudatulaMdaru 2 cEtamu rArE siMgArAlu kaLyANa pasuvu kuMkumA aladaMDI raMgu raMgulA ratnAlu kalipi mutyAlu muggulu vEyaraMDi kaLyANa ativa kOrina varuDU atilOka suMdaruDOyammA atagAni kanniMTa jatayaunu mA kommA - A ha cilakalakoliki padmAvatikI kulukE siMgAraM - celi guNamE baMgAraM navalAmaNiki nagavulaganiki manasE lAvaNyaM lE vayasE vayyAraM cakkani cekkili cukkeMdulakE - eMdukE caMdamAmalO nalupunnaMdukE - AhA cinadAniki A siggeMdulakE - avunu eMdukE ? callanaina tallini SaMkaruni rANivi calla dIvenalE ivvavamma dEvErI jayagaurI calla' pasiDi kalala bAla tana pariNaya SuBavELa pasiDi praNamillenu bratukellanu paccanaina paMTagA dIvenalE ivvavammA dEvErI jayagaurI click here to hear the song
కళ్యాణ వైభవమీనాడే చెలి కళ్యాణ వైభవ మీనాడే మన పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ చూతము రారే సుదతులందరు 2 చేతము రారే సింగారాలు కళ్యాణ పసువు కుంకుమా అలదండీ రంగు రంగులా రత్నాలు కలిపి ముత్యాలు ముగ్గులు వేయరండి కళ్యాణ అతివ కోరిన వరుడూ అతిలోక సుందరుడోయమ్మా అతగాని కన్నింట జతయౌను మా కొమ్మా - ఆ హ చిలకలకొలికి పద్మావతికీ కులుకే సింగారం - చెలి గుణమే బంగారం నవలామణికి నగవులగనికి మనసే లావణ్యం లే వయసే వయ్యారం చక్కని చెక్కిలి చుక్కెందులకే - ఎందుకే చందమామలో నలుపున్నందుకే - ఆహా చినదానికి ఆ సిగ్గెందులకే - అవును ఎందుకే ? చల్లనైన తల్లిని శంకరుని రాణివి చల్ల దీవెనలే ఇవ్వవమ్మ దేవేరీ జయగౌరీ చల్ల' పసిడి కలల బాల తన పరిణయ శుభవేళ పసిడి ప్రణమిల్లెను బ్రతుకెల్లను పచ్చనైన పంటగా దీవెనలే ఇవ్వవమ్మా దేవేరీ జయగౌరీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment