Song » Kalaga Kammani Kalaga / కలగా కమ్మని కలగా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
Ame : kalagA kammani kalagA mana jIvItAlu manavalegA kalagA anurAgamE jIvana jIvamugA AnaMdame mana kaMdamugA kalagA Ame : rAgavaSamuna mEGamAlika malaya pavanuni alipi tElagA ataDu : koMDanu tagili guMDiya karigi nIrai Erai pArunugA kalagA kammani kalagA ataDu : velugu cIkaTalu kalabOsina I kAlamu cEtilO kIlu bommalamu Ame : BAvanalOnE jIvanamunadi mamatE jagatini naDupunadi mamatE jagatini naDupunadi kalagA kammani kalagA Ame: tETikOsamai tEniya dOcE viri kanniyakA saMbaramEmO ataDu : vEroka virini cErina priyuni kAMcinappuDA kalata EmiTO prEmaku SOkamE PalamEmO rAgamu tyAgamu jatalEmO kalagA click here to hear the song
ఆమె : కలగా కమ్మని కలగా మన జీవీతాలు మనవలెగా కలగా అనురాగమే జీవన జీవముగా ఆనందమె మన కందముగా కలగా ఆమె : రాగవశమున మేఘమాలిక మలయ పవనుని అలిపి తేలగా అతడు : కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా కలగా కమ్మని కలగా అతడు : వెలుగు చీకటలు కలబోసిన ఈ కాలము చేతిలో కీలు బొమ్మలము ఆమె : భావనలోనే జీవనమునది మమతే జగతిని నడుపునది మమతే జగతిని నడుపునది కలగా కమ్మని కలగా ఆమె: తేటికోసమై తేనియ దోచే విరి కన్నియకా సంబరమేమో అతడు : వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో ప్రేమకు శోకమే ఫలమేమో రాగము త్యాగము జతలేమో కలగా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment