Song » Idenannamata / ''ఇదేనన్నమాట''
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
pallavi: idEnannamATa idi adEnannamATa mati matilO lEkuMdi manasEdOlAguMdi aMTE ''idEnannamATa'' caraNaM: prEmaMTE adOrakaM piccannamATa A piccilOnE veccadanaM unnadannamATa ''prEmaMTE'' ''2'' manasistE matipOyiMdannamATa matipOyE mattEdO kammunannamATa ''idEnannamATa'' caraNaM :2 kottakotta sogasulu mogga toDugutunnadi avi guMDelO uMDuMDi gubulu rEputunnadi ''kotta kotta'' kurratanaM cEShTalu mudu#0C4D;dalolukutunnavi ''2'' avi kunukurAni kaLlaku kalalugA vaccinavi ''idEnannamATa'' caraNaM:3 ADadAni jIvitamE ariTAku annAru annavALLaMdarU anurAgaM kOrAru ''ADadAni'' tETi egiripOtuMdi puvvu migilipOtuMdi ''2'' tEne unna saMgatE tETi gurtu cEstuMdi ''idEnannamATa'' caraNaM:4 valapE oka vEdana... adi geliciMdA tIyana ''2'' kannebratukE oka SOdhana kalalu paMDistE sAdhana manasu mettabaDutuMdi kannITilOna mamatala paMTakadE tolakarivAna ''idEnannamATa''
పల్లవి: ఇదేనన్నమాట ఇది అదేనన్నమాట మతి మతిలో లేకుంది మనసేదోలాగుంది అంటే ''ఇదేనన్నమాట'' చరణం: ప్రేమంటే అదోరకం పిచ్చన్నమాట ఆ పిచ్చిలోనే వెచ్చదనం ఉన్నదన్నమాట ''ప్రేమంటే'' ''2'' మనసిస్తే మతిపోయిందన్నమాట మతిపోయే మత్తేదో కమ్మునన్నమాట ''ఇదేనన్నమాట'' చరణం :2 కొత్తకొత్త సొగసులు మొగ్గ తొడుగుతున్నది అవి గుండెలో ఉండుండి గుబులు రేపుతున్నది ''కొత్త కొత్త'' కుర్రతనం చేష్టలు ముదు్దలొలుకుతున్నవి ''2'' అవి కునుకురాని కళ్లకు కలలుగా వచ్చినవి ''ఇదేనన్నమాట'' చరణం:3 ఆడదాని జీవితమే అరిటాకు అన్నారు అన్నవాళ్ళందరూ అనురాగం కోరారు ''ఆడదాని'' తేటి ఎగిరిపోతుంది పువ్వు మిగిలిపోతుంది ''2'' తేనె ఉన్న సంగతే తేటి గుర్తు చేస్తుంది ''ఇదేనన్నమాట'' చరణం:4 వలపే ఒక వేదన... అది గెలిచిందా తీయన ''2'' కన్నెబ్రతుకే ఒక శోధన కలలు పండిస్తే సాధన మనసు మెత్తబడుతుంది కన్నీటిలోన మమతల పంటకదే తొలకరివాన ''ఇదేనన్నమాట''
0 comments:
Post a Comment