Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Gussaa rangaiah.. / గుస్సా రంగయ్య..

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    gussA raMgayya... koMcaM taggayya

    kOpaM maniShiki eggayyA..

    gussA raMgayya.. koMcaM taggayya...

    kOpaM maniShiki eggayyA..

    I lOkaM mArEdi kAdu..

    I SOkAlu tIrEvi kAvu..

    I lOkaM mArEdi kAdu..

    I SOkAlu tIrEvi kAvu..

    dOra pAkAna vunnAnu nEnu

    kotta lOkAnni nAlOna cUDu



    gussA raMgayya... koMcaM taggayya

    kOpaM maniShiki eggayyA..



caraNaM 1:



    dESAnni dOcETi AsAmulunnAru..U..

    dEvuNNi digamiMgu pUjArulunnAru..U...

    prANAlatO ADu vyApArulunnAru..U...

    maniShikI maMcikI samAdhi kaTTAru..U...



    mahAtmuleMdaru sahAya paDina maMci jaraga lEdu..

    mahAtmuleMdaru sahAya paDina maMci jaraga lEdu...

    jAtivaidyulE kOta kOsinA nIti bratakalEdu...

    BOgAlu vetukADu vayasu..

    anurAgAla jati pADu manasu..

    nI dAhAni kanuvaina sogasu...

    nI soMtAnni cEstuMdi paDucu...



    A..gussA raMgayya... koMcaM taggayya

    kOpaM maniShiki eggayyA..



caraNaM 2:



    A...kATukeTTina kaLLalO kaipulunnavi..I..

    malleleTTina kurulalO mApulunnavi..I...

    vanne tErina kannelO cinnelunnavi..I...

    anni nIvE anuTaku rujuvulunnavi..I...



    cakkani cukkA sarasanuMDaga pakka cUpu lEla..

    cakkani cukkA sarasanuMDaga pakka cUpu lEla..

    bAgupaDani I lOkaM kOsaM bAdha paDEdEla..

    mOhAnni rEpiMdi rEyi..

    mana pEgullO vuMdOyi hAyi...

    I aMdAnikaMdivvu cEyi...

    AnaMdAla baMdhAlu vEyi...



    gussA raMgayya... koMcaM taggayya

    kOpaM maniShiki eggayyA..
పల్లవి:

    గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

    కోపం మనిషికి ఎగ్గయ్యా..

    గుస్సా రంగయ్య.. కొంచం తగ్గయ్య...

    కోపం మనిషికి ఎగ్గయ్యా..

    ఈ లోకం మారేది కాదు..

    ఈ శోకాలు తీరేవి కావు..

    ఈ లోకం మారేది కాదు..

    ఈ శోకాలు తీరేవి కావు..

    దోర పాకాన వున్నాను నేను

    కొత్త లోకాన్ని నాలోన చూడు



    గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

    కోపం మనిషికి ఎగ్గయ్యా..



చరణం 1:



    దేశాన్ని దోచేటి ఆసాములున్నారు..ఊ..

    దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు..ఊ...

    ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు..ఊ...

    మనిషికీ మంచికీ సమాధి కట్టారు..ఊ...



    మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు..

    మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు...

    జాతివైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు...

    భోగాలు వెతుకాడు వయసు..

    అనురాగాల జతి పాడు మనసు..

    నీ దాహాని కనువైన సొగసు...

    నీ సొంతాన్ని చేస్తుంది పడుచు...



    ఆ..గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

    కోపం మనిషికి ఎగ్గయ్యా..



చరణం 2:



    ఆ...కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి..ఈ..

    మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి..ఈ...

    వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి..ఈ...

    అన్ని నీవే అనుటకు రుజువులున్నవి..ఈ...



    చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల..

    చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల..

    బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేల..

    మోహాన్ని రేపింది రేయి..

    మన పేగుల్లో వుందోయి హాయి...

    ఈ అందానికందివ్వు చేయి...

    ఆనందాల బంధాలు వేయి...



    గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య

    కోపం మనిషికి ఎగ్గయ్యా..

0 comments:

Post a Comment