Monday, July 13, 2020

Son of Satyamurty » chal chal chalo      సన్నాఫ్ సత్యమూర్తి » చల్ చల్ చలో

July 13, 2020 Posted by Publisher , No comments

Song » chal chal chalo / చల్ చల్ చలో
Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Suraj / సూరజ్  ,Song Category : Love & Romantic Songs
rAjyaM gelisinODu rAjautADu
rAjyaM iDisinODE rAmaseMdruDu
yuddhaM gelisETODu vIruDu SUruDu
yuddhaM iDisETODu dEvuDu
batukE yuddhamainODE yOdhuDu



pallavi:
cal cal calO laiP sE milO
idO kotta cApTar jasT sE halO
cal calO calO caliMcu dArilO
pratI okka CAleMj PEs ceyyarO
tIpitO pATu O koMta cEdu
aMdiMcaDaM jiMdagIki alavATE
kaShTamE rAdanE gyAraMTI lEdu
paDEsi parugu nErpu ATE bratukaMTE
aMdukO hattukO muMdarunna I kShaNAnni



cal cal calO laiP sE milO
idO kotta cApTar jasT sE halO
cal calO calO caliMcu dArilO
pratI okka CAleMj PEs ceyyarO



caraNaM:
kannILLeMduku uppaguMTAy 
tiyyaguMTe kaShTAlanu vadalaM ganuka
saMdraM lOnE cEpaluMTAy
ATu pOTu naDimadhyE Upiri poMdAli ganaka



nIkE eMduku I samasya
cikkulostE EmAtraM cedaravu ganaka
nIkE EmiTI amAvAsya
nalupunaina gelupallE mArcE caMdruDivi ganaka
bedurE lEni nIkugAka
evarikedurupaDutuMdi nippula naDaka
cUdA#0C4D;damaMTU nI taDAKA
evarikedurupaDutuMdI nippula naDaka
cUddAmaMTU nI taDAKA
vacciMdI ibbaMdi nuvvunna iMTi gaDapa dAkA
paDDavADE pagilinODE paiki lEcE prativADU
okkaDainA kAnarADE jIvitAnni pOrADakuMDa gelicinODu



caraNaM:
maDatE nalagani SharTulAgA
almArAlO paDi uMTE arthaM lEdu
gItE tagalani kAgitaMlA
puTTi cedalu paTTi pOtE PalitaM lEnE lEdu
puDutUnE gukka peTTinAka
kaShTamanna mATa nIku kottEM kAdu
kommallO paDi cikkukOka
AkASaM ettullO E gAlipaTaM egaralEdu
plas kAdu maisan kAdu anuBavAlE EvainA
OrcukuMTU nErcukuMTU sAgipOrA
nIdaina gelupu dArilOna



cal cal calO laiP sE milO
idO kotta cApTar jasT sE halO
cal calO calO caliMcu dArilO
pratI okka CAleMj PEs ceyyarO
రాజ్యం గెలిసినోడు రాజౌతాడు
రాజ్యం ఇడిసినోడే రామసెంద్రుడు
యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు
యుద్ధం ఇడిసేటోడు దేవుడు
బతుకే యుద్ధమైనోడే యోధుడు



పల్లవి:
చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో
తీపితో పాటు ఓ కొంత చేదు
అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని



చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో



చరణం:
కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ 
తియ్యగుంటె కష్టాలను వదలం గనుక
సంద్రం లోనే చేపలుంటాయ్
ఆటు పోటు నడిమధ్యే ఊపిరి పొందాలి గనక



నీకే ఎందుకు ఈ సమస్య
చిక్కులొస్తే ఏమాత్రం చెదరవు గనక
నీకే ఏమిటీ అమావాస్య
నలుపునైన గెలుపల్లే మార్చే చంద్రుడివి గనక
బెదురే లేని నీకుగాక
ఎవరికెదురుపడుతుంది నిప్పుల నడక
చూదా్దమంటూ నీ తడాఖా
ఎవరికెదురుపడుతుందీ నిప్పుల నడక
చూద్దామంటూ నీ తడాఖా
వచ్చిందీ ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డవాడే పగిలినోడే పైకి లేచే ప్రతివాడూ
ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు



చరణం:
మడతే నలగని షర్టులాగా
అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు
గీతే తగలని కాగితంలా
పుట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాట నీకు కొత్తేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్ కాదు మైసన్ కాదు అనుభవాలే ఏవైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా
నీదైన గెలుపు దారిలోన



చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

0 comments:

Post a Comment