Thursday, July 16, 2020

Sivamani » Alo alo anniyallo      శివమణి » ఏలో ఏలో ఎన్నియల్లో

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Alo alo anniyallo / ఏలో ఏలో ఎన్నియల్లో
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Vishwa / విశ్వ ,Singer : Smitha / హాయ్ రబ్బా స్మిత  ,Song Category : Others
pa: ElO ElO enniyallO tElE IDE tEniyallO
allibilli yavvanAllO.... yavvanAllO....  yavvanAllO....
niMgi nEla vEDukallO IDE vaccE pallakIlO
kannejAji jAvaLIllO.... jAvaLIllO.... jAvaLIllO....
ElO ElO enniyallO kUsE guvva kommalallO
vaccE mAGaM enninALLo  enninALLo 
kOlO kOlO kannevaLLO vacci vAlE vAnavillO
rEgE nAlO kOrikEdO.....kOrikEdO.....kOrikEdO.....
ninnamonnallO kAnarAni vanneloccAyi mEnilO
UrukOnaMTu UsulEvO urakalESAyi talapullO ||ElO||
ca: niMgilOni tAralannI niccenEsi aMdukO
meruputIge kOsukocci kurulalOna turumukO
vennelamma vAkiTa muggulEsi muMgiTa
viMta viMta vEDukE cEyi
kottadAri kOritE hayi
AkatAyi allarEnOyI                 ||ElO ElO||
ca: kalatalannI pakkaneTTi mamatalannI allipO
pagalu rEyi padilamaina prEmalEdu paMcukO
rEgitunna gAlilA urakalEsE ErulA
sAhasaMtO sAgipOvAli 
kottapATe pADukOvAli
aMbarAlE aMdukOvAli         ||ElO ElO||
ప: ఏలో ఏలో ఎన్నియల్లో తేలే ఈడే తేనియల్లో
అల్లిబిల్లి యవ్వనాల్లో.... యవ్వనాల్లో....  యవ్వనాల్లో....
నింగి నేల వేడుకల్లో ఈడే వచ్చే పల్లకీలో
కన్నెజాజి జావళీల్లో.... జావళీల్లో.... జావళీల్లో....
ఏలో ఏలో ఎన్నియల్లో కూసే గువ్వ కొమ్మలల్లో
వచ్చే మాఘం ఎన్నినాళ్ళొ  ఎన్నినాళ్ళొ 
కోలో కోలో కన్నెవళ్ళో వచ్చి వాలే వానవిల్లో
రేగే నాలో కోరికేదో.....కోరికేదో.....కోరికేదో.....
నిన్నమొన్నల్లో కానరాని వన్నెలొచ్చాయి మేనిలో
ఊరుకోనంటు ఊసులేవో ఉరకలేశాయి తలపుల్లో ||ఏలో||
చ: నింగిలోని తారలన్నీ నిచ్చెనేసి అందుకో
మెరుపుతీగె కోసుకొచ్చి కురులలోన తురుముకో
వెన్నెలమ్మ వాకిట ముగ్గులేసి ముంగిట
వింత వింత వేడుకే చేయి
కొత్తదారి కోరితే హయి
ఆకతాయి అల్లరేనోయీ                 ||ఏలో ఏలో||
చ: కలతలన్నీ పక్కనెట్టి మమతలన్నీ అల్లిపో
పగలు రేయి పదిలమైన ప్రేమలేదు పంచుకో
రేగితున్న గాలిలా ఉరకలేసే ఏరులా
సాహసంతో సాగిపోవాలి 
కొత్తపాటె పాడుకోవాలి
అంబరాలే అందుకోవాలి         ||ఏలో ఏలో||

0 comments:

Post a Comment