Song » Andamaina lokam / అందమైనలోకం
Song Details:Actor :
Ram / రామ్ ,Actress :
Raasi khanna / రాశీఖన్నా ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Haripriya / హరిప్రియ ,
Sagar / సాగర్ ,Song Category : Love & Romantic Songs
He: aMdamainalOkaM aMdulOna nuvvoka adbhutaM aMdukaega ninnae .. .kOrukuMdi chinni praaNaM She: aMdamaina bhaavaM.. aMdulO nuvu modaTi aksharaM aMdukaega neetO .. .saagutOMdi chinni paadaM He: O chelee anaarkalee.. nee navvulae deepaavaLee She: paerukae naenunnadee.. naa oopirae nuvvaemaree He: chaMdamaamanevvaraina paTTapagalu ChooDagalaraa ninnu naenu choosinaTTugaa charaNaM:1 He: Ora choopuke loMgipOvaDaM.. ..dOra navvuke poMgipOvaDaM praemalOnae naerchukunnaa raatiraMtaa maelukOvaDaM She: ninnu naalO daachukOvaDaM.. nannu neelO choosukOvaDaM nammalaeka nannunaenae appuDappuDu gillukOvaDaM He: O chelee anaarkalee.. baagunnadee haDaaviDee She: naenilaa vinaalanae.. innaaLlanuMchi kalalukannadee charaNaM:2 He: pooTapooTako paMDagavvaDaM.. maaTimaaTiki navvukOvaDaM praemalOna taelutuMTae kashTamaelae taTTukOvaDaM She: diMDunaemO hattukOvaDaM.. juTTuriMgulu tippukOvaDaM praemapichchae raegutuMTae tappadaemO daaritappaDaM He: O chelee anaarkalee.. tamaashaguMdilae idee She: aMdukae saraasaree.. manassu ichchipuchchukunnadee
He: అందమైనలోకం అందులోన నువ్వొక అద్భుతం అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం She: అందమైన భావం.. అందులో నువు మొదటి అక్షరం అందుకేగ నీతో ..సాగుతోంది చిన్ని పాదం He: ఓ చెలీ అనార్కలీ.. నీ నవ్వులే దీపావళీ She: పేరుకే నేనున్నదీ.. నా ఊపిరే నువ్వేమరీ He: చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా చరణం:1 He: ఓర చూపుకె లొంగిపోవడం.. ..దోర నవ్వుకె పొంగిపోవడం ప్రేమలోనే నేర్చుకున్నా రాతిరంతా మేలుకోవడం She: నిన్ను నాలో దాచుకోవడం.. నన్ను నీలో చూసుకోవడం నమ్మలేక నన్నునేనే అప్పుడప్పుడు గిల్లుకోవడం He: ఓ చెలీ అనార్కలీ.. బాగున్నదీ హడావిడీ She: నేనిలా వినాలనే.. ఇన్నాళ్లనుంచి కలలుకన్నదీ చరణం:2 He: పూటపూటకొ పండగవ్వడం.. మాటిమాటికి నవ్వుకోవడం ప్రేమలోన తేలుతుంటే కష్టమేలే తట్టుకోవడం She: దిండునేమో హత్తుకోవడం.. జుట్టురింగులు తిప్పుకోవడం ప్రేమపిచ్చే రేగుతుంటే తప్పదేమో దారితప్పడం He: ఓ చెలీ అనార్కలీ.. తమాషగుందిలే ఇదీ She: అందుకే సరాసరీ.. మనస్సు ఇచ్చిపుచ్చుకున్నదీ
0 comments:
Post a Comment