Song » Vidhatha Thalapuna / విధాత తలపున
Song Details:Actor :
Benerji / బెనర్జీ ,Actress :
Suhasini / సుహాసిని ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
vidhaata talapuna prabhaviMcinadi anaadi jIvana vEdaM..OM.. praaNanaaDulaku spaMdananosagina adi praNava naadaM..OM.. kanula kolanulO pratibiMbiMcina vishwarUpa vinyaasaM.. eda kanumalalO pratidwaniMcina viriMci,vipaMci gaanaM!! A A..aa aa aa sarasa swara sura JarI gamanamau saamavEda saaramidi sarasa swara sura JarI gamanamau saamavEda saaramidi nE paaDina jIvana gItaM..I gItaM.. viraMcinai viraciMcitini I kavanaM.. vipaMcinai vinipiMcitini I gItaM.. praagdisha vENiya paina,dinakara maYUKa taMtrula paina.. jaagRuta vihaMga tatulE vinIla gaganapu vEdika paina!! praagdisha vENiya paina,dinakara maYUKa taMtrula paina.. jaagRuta vihaMga tatulE vinIla gaganapu vEdika paina!! palikina kilakila dwanamula swaragati jagatiki shrIkaaramu kaagaa.. vishwakaaryamunakidi bhaaShyamugaa!! viraMcinai viraciMcitini I kavanaM.. vipaMcinai vinipiMcitini I gItaM.. janiMcu prati shishu gaLamuna palikina jIvana naada taraMgaM cEtana poMdina spaMdana dhwaniMcu hRudaya mRudaMgadwaanaM!! anaadi raagaM aadi taaLamuna anaMta jIvana vaahinigaa.. saagina sRuShTi vilaasamunE!! viraMcinai viraciMcitini I kavanaM.. vipaMcinai vinipiMcitini I gItaM.. naa uCwaasaM kavanaM..naa nishwaasaM gaanaM sarasa swara sura JarI gamanamau saamavEda saaramidi nE paaDina jIvana gItaM..I gItaM..
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..ఓం.. ప్రాణనాడులకు స్పందననొసగిన అది ప్రణవ నాదం..ఓం.. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం.. ఎద కనుమలలో ప్రతిద్వనించిన విరించి,విపంచి గానం!! ఆ ఆ..ఆ ఆ ఆ సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం..ఈ గీతం.. విరంచినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.. ప్రాగ్దిశ వేణియ పైన,దినకర మయూఖ తంత్రుల పైన.. జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన!! ప్రాగ్దిశ వేణియ పైన,దినకర మయూఖ తంత్రుల పైన.. జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన!! పలికిన కిలకిల ద్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా.. విశ్వకార్యమునకిది భాష్యముగా!! విరంచినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.. జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగద్వానం!! అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా.. సాగిన సృష్టి విలాసమునే!! విరంచినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.. నా ఉఛ్వాసం కవనం..నా నిశ్వాసం గానం సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం..ఈ గీతం..
0 comments:
Post a Comment