Sunday, July 19, 2020

Sirivennela » E gaale E nela      సిరివెన్నెల » ఈ గాలీ ఈ నేల

July 19, 2020 Posted by Publisher , No comments

Song » E gaale E nela / ఈ గాలీ ఈ నేల

Song Details:Actor : Benerji / బెనర్జీ ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

I gAlI I nEla I Uru selayEru

nanuganna nA vALLu nA kaLLa lOgiLLu 2

I gAlI I nEla
cinnAri goravaMka kUsEnu AvaMka

nA rAka telisEka vaccEnu nA vaMka cinnAri

ennALLO gaDicAkA innALLaku kaliSAka 2

uppoMgina guMDela kEka egasEnu niMgidAka 2 egasEnu niMgidAka I gAlI
caraNaM:

EnADO E Silpi kannADO I kalanu

E ulitO I Silapai nilipADO I kaLanu EnADO

E valapula talapulatO telipADO I kathanu 2

I rALLE javarALlai ika nATyAlADEnu 2
caraNaM:

kanne mUgamanasu kanna svargasvapnamai

taLukumanna tAra ciluku kAMti cinukulai kanne

gaganagaLamu nuMDi amara gAnavAhini 2

jAluvArutOMdi ilA amRutavarShiNi amRutavarShiNi amRutavarShiNi

I svAtivAnalO nA Atma snAnamADe

nI muraLilO nA hRudayamE svaramulugA mAre

I gAli I nEla I Uru selayEru

nanuganna nA vALLu nAkaLLa lOgiLLu

I gAlI I nEla
పల్లవి:

ఈ గాలీ ఈ నేల ఈ ఊరు సెలయేరు

ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు 2

ఈ గాలీ ఈ నేల
చిన్నారి గొరవంక కూసేను ఆవంక

నా రాక తెలిసేక వచ్చేను నా వంక చిన్నారి

ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిశాక 2

ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక 2 ఎగసేను నింగిదాక ఈ గాలీ
చరణం:

ఏనాడో ఏ శిల్పి కన్నాడో ఈ కలను

ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడో

ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను 2

ఈ రాళ్ళే జవరాళ్లై ఇక నాట్యాలాడేను 2
చరణం:

కన్నె మూగమనసు కన్న స్వర్గస్వప్నమై

తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై కన్నె

గగనగళము నుండి అమర గానవాహిని 2

జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి

ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడె

నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారె

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు

ననుగన్న నా వాళ్ళు నాకళ్ళ లోగిళ్ళు

ఈ గాలీ ఈ నేల

0 comments:

Post a Comment