Sunday, July 19, 2020

Sirivennela » Aadhi Bikshuvu      సిరివెన్నెల » ఆదిభిక్షువు

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Aadhi Bikshuvu / ఆదిభిక్షువు

Song Details:Actor : Benerji / బెనర్జీ ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Special Experimental Songs
aadibhikShuvu vaaDi nEdi kOrEdi
bUDidiccEvaaDinEdi aDigEdi
tIpi raagaala aa kOkilammaku - nalla
raMgunalamina vaaDi nEdi kOrEdi
karaku garjanala mEGamula mEniki merupu
haMgu kUrcina vaaDinEdi aDigEdi        ||aadibhikShuvu||



tEnelolikE pUla baalalaku mUnnaaLLa
aayuviccina vaaDinEdi kOrEdi
baMDaraalanu ciraayuvuga jIviMcamani
aanaticcina vaaDinEdi aDigEdi		 ||aadibhikShuvu||



giribaalatO tanaku kaLyaaNamonariMpa 
darijEru manmathuni masijEsinaaDu
varagarvamuna mUDulOkaalu pIDiMpa
talapOyu danujulanu karuNiMcinaaDu
muKaprIti kOrETi ubbu shaMkaruDu
mukkaMTi mukkOpi tikka shaMKaruDu	||aadibhikShuvu||
ఆదిభిక్షువు వాడి నేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు - నల్ల
రంగునలమిన వాడి నేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు
హంగు కూర్చిన వాడినేది అడిగేది        ||ఆదిభిక్షువు||



తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ
ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండరాలను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది		 ||ఆదిభిక్షువు||



గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప 
దరిజేరు మన్మథుని మసిజేసినాడు
వరగర్వమున మూడులోకాలు పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
ముక్కంటి ముక్కోపి తిక్క శంఖరుడు	||ఆదిభిక్షువు||

0 comments:

Post a Comment