Monday, July 6, 2020

Sirisampadalu » Ee pagalu Reayiga సిరిసంపదలు » ఈ పగలు రేయిగా

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Ee pagalu Reayiga / ఈ పగలు రేయిగా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Savithri / సావిత్రి Music Director : Master Venu / మాస్టర్ \tవేణు Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  S. Janaki / యస్. జానకి Song Category : Others
pallavi:

    I pagalu rEyigA

    paMDu vennelaga mArinadEmi celI

    A kAraNamEmi celI A... U~M..

    viMtakAdu nA ceMtanunnadi

    veMDi vennela jAbili

    niMDu punnami jAbili... O O O...



caraNaM 1:

    manasuna toNikE cirunavveMduku

    pedavula mIdiki rAnIvu

    ahA OhO ahA... A...

    manasuna toNikE cirunavveMduku

    pedavula mIdiki rAnIvu

    pedavi kadipitE madilO medilE mATa teliyunani mAnEvu

    U~M.



caraNaM 2:

    kannulu telipE kathalaneMduku

    reppalArci EmArcEvu

    A~M... A~M... O O O...

    kannulu telipE kathalaneMduku

    reppalArci EmArcEvu

    ceMpalu pUcE keMpulu

    nAtO nijamu telupunani jaDisEvu

    OhOhO...



caraNaM 3:

    aluka cUpi aTuvaipu tirigitE

    agupaDadanukuni navvEvu

    uhuhu..

    aluka cUpi aTuvaipu tirigitE

    agupaDadanukuni navvEvu

    nallani jaDalO mallepUlu

    nI navvunakaddamu cUpEnu AhA...



    veMDivennela jAbili

    niMDu punnami jAbili

    AhahAhA... AhahAhA...

    AhahAhA... AhahAhA...

    UhuhU...
పల్లవి:

    ఈ పగలు రేయిగా

    పండు వెన్నెలగ మారినదేమి చెలీ

    ఆ కారణమేమి చెలీ ఆ... ఊఁ..

    వింతకాదు నా చెంతనున్నది

    వెండి వెన్నెల జాబిలి

    నిండు పున్నమి జాబిలి... ఓ ఓ ఓ...



చరణం 1:

    మనసున తొణికే చిరునవ్వెందుకు

    పెదవుల మీదికి రానీవు

    అహా ఓహో అహా... ఆ...

    మనసున తొణికే చిరునవ్వెందుకు

    పెదవుల మీదికి రానీవు

    పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు

    ఊఁ.



చరణం 2:

    కన్నులు తెలిపే కథలనెందుకు

    రెప్పలార్చి ఏమార్చేవు

    ఆఁ... ఆఁ... ఓ ఓ ఓ...

    కన్నులు తెలిపే కథలనెందుకు

    రెప్పలార్చి ఏమార్చేవు

    చెంపలు పూచే కెంపులు

    నాతో నిజము తెలుపునని జడిసేవు

    ఓహోహో...



చరణం 3:

    అలుక చూపి అటువైపు తిరిగితే

    అగుపడదనుకుని నవ్వేవు

    ఉహుహు..

    అలుక చూపి అటువైపు తిరిగితే

    అగుపడదనుకుని నవ్వేవు

    నల్లని జడలో మల్లెపూలు

    నీ నవ్వునకద్దము చూపేను ఆహా...



    వెండివెన్నెల జాబిలి

    నిండు పున్నమి జాబిలి

    ఆహహాహా... ఆహహాహా...

    ఆహహాహా... ఆహహాహా...

    ఊహుహూ...

0 comments:

Post a Comment