Song » Raaraa swami raaraa / రారా స్వామి రారా
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
rArA svAmi rArA yaduvaMSa sudhAMbudhi caMdra....svAmi rArA SatakOTi manmadhAkArA svararAga sudhArasa vIrA svAmi rArA nA pAli dikku nI vErA nI padamulaMTi mrokkErA nI dAnarA rAvElarA nannElarA Barata SAstra saMBarita padadvaya carita nirata sumadhura maMgaLa gaLa rArA svAmi rArA ||rArA|| rAgAlennO paMDina gArAla nI meDalO anurAga mAlikalE vEyAlani nI callani caraNAlu callina kiraNAlalO rEpaTi kOsaM cIkaTi reppala tera tIyAlani pilicAnu eduTa nilicAnu kOri kOri ninnE valacAnu ||pili|| gaMga kadili vastE kaDali elA poMgiMdO yamuna sAgivastE A gaMga Emi pADiMdO Amani vaccina vEla avani eMta murisiMdO mOhana vENuvu tAkina mOvi elA merisiMdO UgiMdi tanuvu alAgE poMgiMdi manasu nIlAgE Sruti kalipiMdennadO sirisirimuvvala savvaDilO jata kalisiMdippuDE A guDilO nI oDilO ||Sruti|| muvvanai puTTAlani anukunnA nokanADu||2|| divvenai nI velugulu ruvvanI yI nADu ||pili||
రారా స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర....స్వామి రారా శతకోటి మన్మధాకారా స్వరరాగ సుధారస వీరా స్వామి రారా నా పాలి దిక్కు నీ వేరా నీ పదములంటి మ్రొక్కేరా నీ దానరా రావేలరా నన్నేలరా భరత శాస్త్ర సంభరిత పదద్వయ చరిత నిరత సుమధుర మంగళ గళ రారా స్వామి రారా ||రారా|| రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో అనురాగ మాలికలే వేయాలని నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని పిలిచాను ఎదుట నిలిచాను కోరి కోరి నిన్నే వలచాను ||పిలి|| గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో యమున సాగివస్తే ఆ గంగ ఏమి పాడిందో ఆమని వచ్చిన వేల అవని ఎంత మురిసిందో మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో ఊగింది తనువు అలాగే పొంగింది మనసు నీలాగే శ్రుతి కలిపిందెన్నదో సిరిసిరిమువ్వల సవ్వడిలో జత కలిసిందిప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో ||శ్రుతి|| మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు||౨|| దివ్వెనై నీ వెలుగులు రువ్వనీ యీ నాడు ||పిలి||
0 comments:
Post a Comment