Tuesday, July 28, 2020

Siri Siri Muvva » Raa digiraa divinunchi      సిరి సిరి మువ్వ » రా దిగిరా దివినుంచి

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Raa digiraa divinunchi / రా దిగిరా దివినుంచి

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Jayaprada / జయప్రద ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
rA digirA divinuMci  Buviki digirA                 ||rA digirA||
rAma harE SrIrAma harE ||2|
rAti bommaku ravvalu podigina rAma harE SrIrAma harE
rAti bommaku ravvalu podigi rAma harE SrErAma harE ani
paTTina harati cUstU EmI paTTanaTTu kUrcuMTE cAladu ||rA digirA||
alanATi A sIta InATi dEvata
SatakOTi sItala kalabOta I dEvata
rAmacaMdruDA kadalirA rAmabANamE vadalarA
I GOra kalini mAparA I krUra balini AparA ||rA digirA||
naTarAjA Sata sahasra ravitEjA
naTagAyaka vai tAlika munijana BOjA           ||naTarAja||
dInAvana  BavyakaLAdivya padAMBOjA
ceri sagamai rasajagamai
celagina nI celi prANamu balipaSuvai yajNavATi
veli bUDida ayina kShaNamu
satI viyOgamu sahiMcaka
durmatiyau dakShuni madamaDaMcaga
Dhama Dhama Dhama Dhama Damaruka dvanula
namaka camaka yamagamaka layaMkara
sakalalOka jarjarita BayaMkara
vikaTa naTatpada visPu liMgamula
vilaya tAMDavamu salipina nIvE
SilavE ayitE pagilipO
SivuDE ayitE ragilipO
రా దిగిరా దివినుంచి  భువికి దిగిరా                 ||రా దిగిరా||
రామ హరే శ్రీరామ హరే ||౨|
రాతి బొమ్మకు రవ్వలు పొదిగిన రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రేరామ హరే అని
పట్టిన హరతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు ||రా దిగిరా||
అలనాటి ఆ సీత ఈనాటి దేవత
శతకోటి సీతల కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా రామబాణమే వదలరా
ఈ ఘోర కలిని మాపరా ఈ క్రూర బలిని ఆపరా ||రా దిగిరా||
నటరాజా శత సహస్ర రవితేజా
నటగాయక వై తాలిక మునిజన భోజా           ||నటరాజ||
దీనావన  భవ్యకళాదివ్య పదాంభోజా
చెరి సగమై రసజగమై
చెలగిన నీ చెలి ప్రాణము బలిపశువై యజ్ణవాటి
వెలి బూడిద అయిన క్షణము
సతీ వియోగము సహించక
దుర్మతియౌ దక్షుని మదమడంచగ
ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ద్వనుల
నమక చమక యమగమక లయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికట నటత్పద విస్ఫు లింగముల
విలయ తాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో
శివుడే అయితే రగిలిపో

0 comments:

Post a Comment