Thursday, July 16, 2020

Siri Siri Muvva » Andaaniki Andam      సిరి సిరి మువ్వ » అందానికి అందం

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Andaaniki Andam / అందానికి అందం

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Jayaprada / జయప్రద ,Music Director :Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
aMdAniki aMdaM I puttaDi bomma
aMdarikI  aMdanidI pUcina komma
puttaDibommA...pUcina kommA               ||aMdAniki||
palakamanna palakadI paMcadAra  cilaka
kulukE siMgAramaina kolasiggula  molaka
edakannA lOtugA padilaMgA dAcukO
niduriMcE pedavilO padamuMdI pADukO
puttaDi bommA.. pUcina kommA....        ||aMdAniki||
A rANi pAdAla pArANi jilugulO
nI rAjaBOgAlu pADanI telugulO
muDi vEsina koMgunE guDivuMdi telusukO
guDilOni  dEvatani guMDelO kalusukO
puttaDibommA...  pUcina kommA           ||aMdAniki||
sAkI: IjanmakiMtE ilA pADukuMTAnu
muMdu janmavuMTE A kAli muvvanai puDatAnu
puttaDi bommA....  pUcinakommA             ||aMdAniki||
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ  అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా...పూచిన కొమ్మా               ||అందానికి||
పలకమన్న పలకదీ పంచదార  చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల  మొలక
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడి బొమ్మా.. పూచిన కొమ్మా....        ||అందానికి||
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
గుడిలోని  దేవతని గుండెలో కలుసుకో
పుత్తడిబొమ్మా...  పూచిన కొమ్మా           ||అందానికి||
సాకీ: ఈజన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మవుంటే ఆ కాలి మువ్వనై పుడతాను
పుత్తడి బొమ్మా....  పూచినకొమ్మా             ||అందానికి||

0 comments:

Post a Comment