Saturday, July 18, 2020

Shiridi Sai » Vasthunna Baba      శిరిడి సాయి » వస్తున్నా బాబా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Vasthunna Baba / వస్తున్నా బాబా

Song Details:Actor : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Chaitra / చైత్ర ,  M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,  Revanth / రేవంత్ ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
gAlE AgipOtuMdaMTE nammAlA

nElE AvirautuMdaMTE nammAlA

niMgiki Ayuvu tIriMdaMTE nammAlA

daivAniki maraNaM uMTuMdaMTE nammAlA

adi jaragabOdu ani, jagaranIvvanani

vastunnA bAbA vastunnA 

A mRutyuvu rAkanu ApEyAlani vastunnA

mI badulugA nEnE bali avutAnani vastunnA

bAbA vastunnAvastunnA bAbA vastunnA



bAbA mimmalni cUDakuMDA

mI cUpuku nOcukOkuMDA elA bratakaTaM bAbA





bAbA I nijAnni elA BariMcAli

ika mA bAdhalni evaritO ceppukOvAli bAbA



Baktulu mIru mI Baktiki bAnisa nEnu

sUryacaMdrulu, cukkalu nEnai kanapaDutuMTAnu

mimmu kanipeDutunnAnu

bAbA nEnu mI BAraM mOstuMTAnu



samAdhi nuMDE samAdhi nuMDE gamanistAnu

sahAyaM aDigitE kadilostAnu

pilistE palukutAnu pilistE palukutAnu

pilistE palukutAnu



bAbA bAbA bAbA



vastunnA bAbA vastunnA bAbA

nI baduvugA nEnE bali^^avutAnani vastunnA

bAbA vastunnA vastunnA bAbA vastunnA



mI Baktula iMTlO lEdu anEdi mATE vinapaDadani mIrE ceppAru bAbA

mAkippuDu velugu lEdu nIDa lEdu asalu mA bratukki arthamE lEdu

mIru lEnilOTu elA tIrAli bAbA elA tIrAli



nirmalamaina manasutO niScalamaina BaktitO 

nA rUpAnnE talavaMDi mI lOpala koluvavutAnu

nA nAmAnnE palakaMDi mI lOpaM tolagistAnu

nA hArati darSiMcaMDi, mI Apada ApEstAnu

nA viBUdi dhariyiMcaMDi, mI vEdana nAdaMTAnu

nA jyOtulu veligiMcaMDi mI manasulu veligistAnu

nA caritanu paThiMcaMDi mimu caritArthulanu cEstAnu

maraNa Sayya kAdidi SaraNu kOrinavAri karuNa Sayya

samAdhi kAdidi, kaShTAla tolagiMcu sannidhi

j~jAna sirilaMdiMcu pennidhi

SAMti sauKyAlanosagE ShiriDI ShiriDI

SAMti sauKyAlanosagE ShiriDI
గాలే ఆగిపోతుందంటే నమ్మాలా

నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా

నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా

దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా

అది జరగబోదు అని, జగరనీవ్వనని
వస్తున్నా బాబా వస్తున్నా 

ఆ మృత్యువు రాకను ఆపేయాలని వస్తున్నా

మీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా

బాబా వస్తున్నావస్తున్నా బాబా వస్తున్నా



బాబా మిమ్మల్ని చూడకుండా

మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకటం బాబా





బాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి

ఇక మా బాధల్ని ఎవరితో చెప్పుకోవాలి బాబా



భక్తులు మీరు మీ భక్తికి బానిస నేను

సూర్యచంద్రులు, చుక్కలు నేనై కనపడుతుంటాను

మిమ్ము కనిపెడుతున్నాను

బాబా నేను మీ భారం మోస్తుంటాను



సమాధి నుండే సమాధి నుండే గమనిస్తాను

సహాయం అడిగితే కదిలొస్తాను

పిలిస్తే పలుకుతాను పిలిస్తే పలుకుతాను

పిలిస్తే పలుకుతాను



బాబా బాబా బాబా



వస్తున్నా బాబా వస్తున్నా బాబా

నీ బదువుగా నేనే బలిఅవుతానని వస్తున్నా

బాబా వస్తున్నా వస్తున్నా బాబా వస్తున్నా



మీ భక్తుల ఇంట్లో లేదు అనేది మాటే వినపడదని మీరే చెప్పారు బాబా

మాకిప్పుడు వెలుగు లేదు నీడ లేదు అసలు మా బ్రతుక్కి అర్థమే లేదు

మీరు లేనిలోటు ఎలా తీరాలి బాబా ఎలా తీరాలి



నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో 

నా రూపాన్నే తలవండి మీ లోపల కొలువవుతాను

నా నామాన్నే పలకండి మీ లోపం తొలగిస్తాను

నా హారతి దర్శించండి, మీ ఆపద ఆపేస్తాను

నా విభూది ధరియించండి, మీ వేదన నాదంటాను

నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను

నా చరితను పఠించండి మిము చరితార్థులను చేస్తాను

మరణ శయ్య కాదిది శరణు కోరినవారి కరుణ శయ్య

సమాధి కాదిది, కష్టాల తొలగించు సన్నిధి

జ్ఞాన సిరిలందించు పెన్నిధి

శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ షిరిడీ

శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ

0 comments:

Post a Comment