Song » Sai Ante Talli / సాయి అంటే తల్లి
Song Details:Actor :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Actress :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Sad & Patho songs
pallavi: sAyi aMTE talli bAbA aMTE taMDri sAyi bAbA tODElEka talli taMDri lEni pillalamayyAmu... rekkalu reMDU lEni pakShula mayyAmu... nuvvOstAmanna ASatO bratikostAvanna ASatO jAbili kOsaM vEci cUsE cukkalamayyAmu kOTi cukkalamayyAmu kannITi cukkula mayyAmu caraNaM:1 bOthalu cEsEdevaru mA bAdhalu bApEdevaru lIlalu cUpEdevaru mAtO gOLIlADE devaru pATalu pADEdevaru mA porapATulu diddEdevaru tIyaga kasirEdevaru Apai prEmanu kosarEdevaru jIvaM pOsE nuvvE nirjIvuDavainAvA? nuvvu kannulu tericEdAkA mA kaMTiki kunukErAdu tallitaMDri caraNaM:2 mAkiccina nI vibUdinE nIkU kAsta pUsEmayyA lEvayyA sAyi lEvayyA nI cinni cEtikarratO ninnE taTTi lEpEmayya lEvayyA bAbA lEvayyA innALlu nuvvaDigAvu mAnuMDi BikShani yivvALa mEmaDigAmu nI prANa BikShani yiccEvaraku vUrukOmu nuvvoccEvaraku AgalEmu pacci maMcinIrainA tAkabOmu
పల్లవి: సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి బాబా తోడేలేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము... రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము... నువ్వోస్తామన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము కోటి చుక్కలమయ్యాము కన్నీటి చుక్కుల మయ్యాము చరణం:1 బోథలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు తీయగ కసిరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా? నువ్వు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు తల్లితండ్రి చరణం:2 మాకిచ్చిన నీ విబూదినే నీకూ కాస్త పూసేమయ్యా లేవయ్యా సాయి లేవయ్యా నీ చిన్ని చేతికర్రతో నిన్నే తట్టి లేపేమయ్య లేవయ్యా బాబా లేవయ్యా ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని యివ్వాళ మేమడిగాము నీ ప్రాణ భిక్షని యిచ్చేవరకు వూరుకోము నువ్వొచ్చేవరకు ఆగలేము పచ్చి మంచినీరైనా తాకబోము
0 comments:
Post a Comment