Sunday, July 12, 2020

Shiridi Sai » Nee Padamula      శిరిడి సాయి » నీ పదముల ప్రభవించిన

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Nee Padamula / నీ పదముల ప్రభవించిన
Song Details:Actor : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,Song Category : Devotional Songs
rAjAdhirAja yOgirAja parabrahma

SrI saccitAnaMda samardha sadguru 

sAyinAtha  maharAj kI jai

nI padamula praBaviMcina gaMgA, yamunA

mA pAliTa prasariMcina prEmA, karuNA

E kShEtramaina, tIrthamaina nIvEgA

E jIvamaina, BAvamaina nIvEgA

nIvu lEni cOTu lEdu sAyI

I jagamE nI dvArakAmAyI

caraNaM 1

manujulalO daivamu nIvu 

kOsala rAmuDivai kanipiMcAvU

guri tappani Baktini peMcAvu

mArutigA agupiMcAvU

Bakta sulaBuDavai karuNiMcAvU

BOLA SaMkaruDiga darSanamiccAvu

mukkOTi daivAlu okkaTaina nIvu

EkamanEkammuga vistariMcinAvu

nIvu lEni cOTu lEdu sAyI

I jagamE nI dvArakAmAyI

caraNaM 2

AraDugula dEhamu kAvu

Baktula anuBUtiki AkRuti nIvU

taratamamula BEdamu ceripAvu

matamannadi lEdannAvU

anni jIvulalO koluvainAvU

atmA paramAtmalu okaTEnannAvU 

aNurENu brahmAMDa viSvamUrti nIvU

sRuShTi vilAsamunakE sUtradhAri nIvu

nIvu lEni cOTu lEdu sAyI

I jagamE nI dvArakAmAyI
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చితానంద సమర్ధ సద్గురు 
సాయినాథ  మహరాజ్ కీ జై 

పల్లవి
నీ పదముల ప్రభవించిన గంగా, యమునా

మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
ఏ క్షేత్రమైన, తీర్థమైన నీవేగా
ఏ జీవమైన, భావమైన నీవేగా
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
చరణం 1
మనుజులలో దైవము నీవు 
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
చరణం 2
ఆరడుగుల దేహము కావు
భక్తుల అనుభూతికి ఆకృతి నీవూ
తరతమముల భేదము చెరిపావు
మతమన్నది లేదన్నావూ
అన్ని జీవులలో కొలువైనావూ
అత్మా పరమాత్మలు ఒకటేనన్నావూ 
అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ

0 comments:

Post a Comment