Friday, July 10, 2020

Shh Gupchup » Ore thraapee      ష్ ... గప్ చుప్ » ఒరే త్రాపీ

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Ore thraapee / ఒరే త్రాపీ
Song Details:Actor : N/A / వర్తించదు ,Actress : Bhanupriya / భాను ప్రియ ,Music Director : Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Comedy Songs

ఒరేయ్ త్రాపీ! మహాపాపీ! కురూపీ! నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీ.పీ, ముండమోపీ! జిరాఫీ! నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపీ! అంక ఛండాలుడా! బంక బధిరాంధుడా! పరమ పాపిష్ఠ నికృష్ఠ దుష్టాత్ముడా! నీ నీచ రూపంబు చూడంగ పాపంబు, నీ కంఠ నాళంబు కక్కూసు గొట్టంబు, నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద, నీ పల్కులే చెత్త, నీ జన్మ డ్రైనేజి! నువ్వో దగుల్బాజి, యేబ్రాసి, చప్రాసి, సన్నాసివీ! ఆశుధ్ధ స్వరూపా! అబధ్ధ ప్రలాపా! పింగు బొంగైన పింజారిగా! కుత్తేకా బచ్చా! కొవ్వెక్కిన లుఛ్ఛా! పగిలేను నీ పుచ్చె, తీరేను నా కచ్చ, నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చిగా! భ్రష్టాతి భ్రష్టా! పరాకాష్ఠ  కెళ్ళావు దుష్టత్వమందున్, ముదనష్ఠుడా1 త్రాష్ఠుడా! కుష్ఠు ముష్ఠోడి అంగుష్ఠమా! వృధ్ధ  క్షయరోగి ఉఛ్ఛిష్టమా! ఒరేయ్ పళ్ళ కిచ్చీ! అరేయ్ చిల్లి గోచీ! ఒరేయ్ పాచి ముఖమా! నడుస్తున్న శవమా!  వేడి ఇడ్లీలు పారేయకన్  సద్ది సాంబారు తెగ త్రాగు సోంబేరిగా! పెద్ద ఇడియట్టువీ,    చద్ది పెసరట్టువీ, పిచ్చి టేస్టున్న శాడిస్టువీ, గజ్జి పాదాల మరగుజ్జువీ,  ఉచ్ఛనీచాలు లేనట్టి రాస్కేలువీ, తేలువీ! ఒరేయ్ అక్కుపక్షీ! నిరక్షరకుక్షీ! కుంకాక్షి! ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా! నువ్వు  చుంచెలుక గొద్దెవీ, రాబందు రెట్టవీ, బొద్దింక కేశానివీ, సీంపందిమూతివీ, గబ్బిలం తోకవీ, ఏకాకి కాకీకవీ! న్యూసెన్సు డాంకీవి, నోసెన్సు మంకీవి, కుడితిలో చిట్టెలుకవీ! మునిసిపాలిటీ పందికిన్ మోక్షగుండానివి, ఎద్దు మొండానివీ! సృష్టి మొత్తంబులో శుంఠవీ! ఒరేయ్ పేడ తట్టా! అరేయ్ చెత్తబుట్టా! ఒరేయ్ గడ్డిపాచా! అరేయ్ నారపీచా! ఒరేయ్ తుప్పు మేకా! అరేయ్ పందితోకా! ఒరేయ్ వానపామూ! ఇలా తొక్కుతామూ! ఒరేయ్ గౌడి గేదే! ఇదే బడితె పూజా!  నిన్ను తిట్టంగ నేనెంత వాడన్, దురాత్మా! ఏడేడు లోకాల భాషలకు శోషొచ్చి మూర్ఛిల్లురా! మహా బండ బూతుల్ తలల్ వంచు నీ ముందు పాపాత్ముడా!  ఓ బోడి వెధవా!  ఓ అంట్ల వెధవా! నెలతక్కువెధవా! వెదవన్నరెధవా! ముప్పావు వెధవా! పరిపూర్ణ వెధవా!  థూii

0 comments:

Post a Comment