Tuesday, July 21, 2020

Shatruvu » Poddunne Puttindi      శత్రువు » పొద్దున్నే పుట్టింది

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Poddunne Puttindi / పొద్దున్నే పుట్టింది

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Vijayashanthi / విజయశాంతి ,Music Director : Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    poddunnE puTTiMdi caMdamAma

    moggallE vicciMdi muddugumma

    maunaMga puTTAva gItikA hOy

    snEhaMtO mITAva mellagA

    toli poddaMTi aMdAlu I nADu niddaralEcI mutyAla muggulupeTTE vannela vAkiTlO



    poddunnE puTTiMdi caMdamAma

    moggallE vicciMdi muddugumma



caraNaM 1:

    uggeTTA paTTAlO nalugeTTA peTTAlO lAleTTA pOyAlOyammA O rabbaru bommA lAliMcEdeTTA ceppammA

    moggaMTi buggalO aggallE siggostE jAbillini rappiMcAlayyO O muddula kannA kaugiTlO jO koTTAlayyO

    nA kaMTi pApallO uyyAla veyyAlA I koMTe pApAyikI

    muMdU muDupUlEnI I podduTi vennela AvirilO muddu muripAlanni paMDiMcEdeTTAgO

    ika E pEru pETTAlO innALLu erugani I koMTe cakkiligiMtala ukiribikkiriki



    poddunnE puTTiMdi caMdamAma

    moggallE vicciMdi muddugumma



caraNaM 2:

    nI kOsaM puTTAnu niluvellA pUsAnu guMDellE gUDE kaTTAnu nA baMgaru guvva gummaMlO cUpulu peTTAnu

    nI nEstaM kaTTAnu nI dArE paTTAnu kaLLallO kApuramuMTAnu nA paccani kommA pommannA pakkaki pOlEnu

    SRuMgAra snEhAla saMkeLLu veyyAla ciMgAri ciMdATatO

    urikE gOdAraMTi nA uDukUduDukU taggiMcI koMgunakaTTEsEdi kiTukEdO ceppammA

    pasi paruvAlu cUstuMTE baruvaina kannullO pagalEdO rEyEdO tEliyadu lEvayyO



    poddunnE puTTiMdi caMdamAma

    moggallE vicciMdi muddugumma

    maunaMga puTTAva gItikA hOy

    snEhaMtO mITAva mellagA

    toli poddaMTi aMdAlu I nADu niddaralEcI mutyAla muggulupeTTE vannela vAkiTlO
పల్లవి:

    పొద్దున్నే పుట్టింది చందమామ

    మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

    మౌనంగ పుట్టావ గీతికా హోయ్

    స్నేహంతో మీటావ మెల్లగా

    తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో



    పొద్దున్నే పుట్టింది చందమామ

    మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ



చరణం 1:

    ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మా ఓ రబ్బరు బొమ్మా లాలించేదెట్టా చెప్పమ్మా

    మొగ్గంటి బుగ్గలో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జో కొట్టాలయ్యో

    నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికీ

    ముందూ ముడుపూలేనీ ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో

    ఇక ఏ పేరు పేట్టాలో ఇన్నాళ్ళు ఎరుగని ఈ కొంటె చక్కిలిగింతల ఉకిరిబిక్కిరికి



    పొద్దున్నే పుట్టింది చందమామ

    మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ



చరణం 2:

    నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లే గూడే కట్టాను నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను

    నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను నా పచ్చని కొమ్మా పొమ్మన్నా పక్కకి పోలేను

    శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాల చింగారి చిందాటతో

    ఉరికే గోదారంటి నా ఉడుకూదుడుకూ తగ్గించీ కొంగునకట్టేసేది కిటుకేదో చెప్పమ్మా

    పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో రేయేదో తేలియదు లేవయ్యో



    పొద్దున్నే పుట్టింది చందమామ

    మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

    మౌనంగ పుట్టావ గీతికా హోయ్

    స్నేహంతో మీటావ మెల్లగా

    తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

0 comments:

Post a Comment