Song » Dorakunaa / దొరకునా
Song Details:Actor :
J.V.Somayaajulu / జె.వి.సోమయాజులు ,Actress :
Manju Bhargavi / మంజు భార్గవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Vani Jayaram / వాణి జయరాం ,Song Category : Others
dorakunA dorakunA dorakunA dorakunA iTuvaMTi sEvA nI pada rAjIvamula cEru nirvANa sOpAna madirOhaNamu sEyutrOva ||dorakunA|| rAgAlanaMtAlu nIvEyi rUpAlu BavarOgati mirAla pOkArcu dIpAlu nAdAtmakuDavai nAlOna veligE nA prANa dIpamai nAlOna veligE... ninu kOlcuvELa dEvAdi dEvA... dEvAdi dEvA... || dorakunA|| uccvAsa niSvAsamulu vAyu lInAlu spaMdiMcu navanADulE vINA gAnAlu naDalU, edalOni saDulE mRudaMgAlu nAlOni jIvamai nAkunna daivamai velugoMdu vELa mahAnuBAvA dorakunA iTuvaMTi sEvA nI pada rAjIvamula cEru nirvANa sOpAna madirOhaNamu sEyutrOva ||dorakunA||
దొరకునా దొరకునా దొరకునా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ ||దొరకునా|| రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగతి మిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన వెలిగే నా ప్రాణ దీపమై నాలోన వెలిగే... నిను కోల్చువేళ దేవాది దేవా... దేవాది దేవా... || దొరకునా|| ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలూ, ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ ||దొరకునా||
0 comments:
Post a Comment