Song » Evandoye Srimathigaru / ఏవండోయ్ శ్రీమతిగారు
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
Satyam / సత్యం ,Lyrics Writer :
Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: U~M... uhuhuhuhu EvaMDOy SrImatigAru.. lEvaMDOy poddekkiMdi.. EvaMDOy SrImatigAru.. lEvaMDOy poddekkiMdi.. illu UDcAli.. kaLLApu callAli.. nILLu tODAli.. Apai kAPI kAyAlI..I.. EvaMDOy SrImatigAru.. lEvaMDOy poddekkiMdi.. caraNaM 1: habba.. plIj.. okka gaMTaMDI.. gaMTA gaMTani aMTU uMTE lOnuMcI Akali maMTA.. maMTA maMTani gija gijamaMTE ammAnAnnatO taMTA.. maMTanu maricEsi talupulu mUsEsI.. duppaTi musugEsi sarigama pADEsi.. APIsuki nAmaM peDitE ADabAsutO taMTA.. hU~M Who is that rAkShasi unnadi oka SUrpaNaKA.. lETaitE nokkunu nA pIkA.. Apai iccunu oka lEKA.. A lEKatO iMTiki rAlEkA.. naligi naligi.. kumili kumili.. cacci cacci.. bratiki bratiki.. ayyabAbOy.. aMdukE.. EmaMDOy SrImatigArU.. lEvaMDOy poddekkiMdi.. habbA.. caraNaM 2: kAPI.. kAPI.. kAPI kAPI aMTU uMTE ulakaru palakaru EMTaMTA... vaMTA vArpu cEsEdi iMTiki peLLAmEnaMTA... aPkOrs nAku rAdE.. okkasAri cEsi cUpiMcaMDI... mm.. pAlanu marigiMcI.. glAsulO pOsEsi pauDaru kalipEsI.. spUnutO tippEsi vEDiga nOTiki aMdistE.. nAnsens.. cakkera lEdu.. habbA.. aravaku aravaku O tallI.. ariste illE beMbellI.. irugUporugU bayaldEri ninnU nannU cUseLLi... iMTA bayaTA.. UrU vADA.. gusa gusalADEstE nijaMgA.. nItODu aMdukE.. EvaMDOy SrImatigAru AgaMDOy callAraMDI..
పల్లవి: ఊఁ... ఉహుహుహుహు ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. ఇల్లు ఊడ్చాలి.. కళ్ళాపు చల్లాలి.. నీళ్ళు తోడాలి.. ఆపై కాఫీ కాయాలీ..ఈ.. ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. చరణం 1: హబ్బ.. ప్లీజ్.. ఒక్క గంటండీ.. గంటా గంటని అంటూ ఉంటే లోనుంచీ ఆకలి మంటా.. మంటా మంటని గిజ గిజమంటే అమ్మానాన్నతో తంటా.. మంటను మరిచేసి తలుపులు మూసేసీ.. దుప్పటి ముసుగేసి సరిగమ పాడేసి.. ఆఫీసుకి నామం పెడితే ఆడబాసుతో తంటా.. హూఁ Who is that రాక్షసి ఉన్నది ఒక శూర్పణఖా.. లేటైతే నొక్కును నా పీకా.. ఆపై ఇచ్చును ఒక లేఖా.. ఆ లేఖతో ఇంటికి రాలేకా.. నలిగి నలిగి.. కుమిలి కుమిలి.. చచ్చి చచ్చి.. బ్రతికి బ్రతికి.. అయ్యబాబోయ్.. అందుకే.. ఏమండోయ్ శ్రీమతిగారూ.. లేవండోయ్ పొద్దెక్కింది.. హబ్బా.. చరణం 2: కాఫీ.. కాఫీ.. కాఫీ కాఫీ అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా... వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంటా... అఫ్కోర్స్ నాకు రాదే.. ఒక్కసారి చేసి చూపించండీ... మ్మ్.. పాలను మరిగించీ.. గ్లాసులో పోసేసి పౌడరు కలిపేసీ.. స్పూనుతో తిప్పేసి వేడిగ నోటికి అందిస్తే.. నాన్సెన్స్.. చక్కెర లేదు.. హబ్బా.. అరవకు అరవకు ఓ తల్లీ.. అరిస్తె ఇల్లే బెంబెల్లీ.. ఇరుగూపొరుగూ బయల్దేరి నిన్నూ నన్నూ చూసెళ్ళి... ఇంటా బయటా.. ఊరూ వాడా.. గుస గుసలాడేస్తే నిజంగా.. నీతోడు అందుకే.. ఏవండోయ్ శ్రీమతిగారు ఆగండోయ్ చల్లారండీ..
0 comments:
Post a Comment