Tuesday, July 21, 2020

Seethamma vakitlo sirimalle chettu » Meghaallo      సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు » మేఘాల్లో

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Meghaallo / మేఘాల్లో
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,  Venkatesh / వెంకటేష్  ,Actress : Anjali / అంజలి ,  Samantha / సమంత ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Karthik / కార్తీక్ ,  Sree ramachandra / శ్రీ రామచంద్ర  ,Song Category : Others
mEGAllO sannAyi rAgaM mOgiMdi

mELAlu tALAlu vinaraMDi

siriki SrIhariki kaLyANaM kAnaMDi

SrIrastu SuBamastu anaraMDi



acca telugiMTlO peLliki arthaM ceppAraMTU

muccaTagA  idi sAkShyaM cebutAmaMTU

janulaMtA jai koTTElA jaripistAmaMDI



aMdAla kuMdanapu bommavani

jata cErukunna A caMduruni

vaMdELla baMdhamai allukuni

cEyaMdukOvaTE O ramaNI



iMtavarakennO cUSAM 

anukuMTE saripOdugA

eMta baruvaMTE mOsE dAkA 

teliyadugA

iMtamaMdunnAmE 

anipiMcE biMkaM cATugA 

kAstayinA kaMgAru uMTuMdigA

nIkayitE sahajaM 

tIyani baruvai sogasiMcE biDiyaM

panulennO peTTi 

mA talalu vacciMdE I samayaM

magALlamammA EM cEstAM

saMtOShaMgA mOstAM

Gana vijayaM poMdAkE tIriggA garvistAM...



aMdAla kuMdanapu bommavani

jata cErukunna A caMduruni

vaMdELla baMdhamai allukuni

cEyaMdukOvaTE O ramaNI





rAma cilukalatO ceppi

rAyiMcAmE patrika

rAja haMsalatO paMpi AhvAniMcAMgA

kudurugA nimiShaM kUDA

nilabaDalEvE bottigA

E mAtraM E cOTA rAjI paDalEka

cuTTAlaMdarikI AnaMdaMtO kaLlu cemarcElA

giTTani vALlainA AScaryaMtO kanulanu viccElA

kalallOnainA kannAmA ...kathanainA vinnAmA

I vaiBOgaM apurUpaM anukuMTArammA



aMdAla kuMdanapu bommavani

jata cErukunna A caMduruni

vaMdELla baMdhamai allukuni

cEyaMdukOvaTE O ramaNI


 
Click here to hear the song
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది

మేళాలు తాళాలు వినరండి

సిరికి శ్రీహరికి కళ్యాణం కానండి

శ్రీరస్తు శుభమస్తు అనరండి



అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ

ముచ్చటగా  ఇది సాక్ష్యం చెబుతామంటూ

జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ



అందాల కుందనపు బొమ్మవని

జత చేరుకున్న ఆ చందురుని

వందేళ్ల బంధమై అల్లుకుని

చేయందుకోవటే ఓ రమణీ



ఇంతవరకెన్నో చూశాం 

అనుకుంటే సరిపోదుగా

ఎంత బరువంటే మోసే దాకా 

తెలియదుగా

ఇంతమందున్నామే 

అనిపించే బింకం చాటుగా 

కాస్తయినా కంగారు ఉంటుందిగా

నీకయితే సహజం 

తీయని బరువై సొగసించే బిడియం

పనులెన్నో పెట్టి 

మా తలలు వచ్చిందే ఈ సమయం

మగాళ్లమమ్మా ఏం చేస్తాం

సంతోషంగా మోస్తాం

ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం...



అందాల కుందనపు బొమ్మవని

జత చేరుకున్న ఆ చందురుని

వందేళ్ల బంధమై అల్లుకుని

చేయందుకోవటే ఓ రమణీ





రామ చిలుకలతో చెప్పి

రాయించామే పత్రిక

రాజ హంసలతో పంపి ఆహ్వానించాంగా

కుదురుగా నిమిషం కూడా

నిలబడలేవే బొత్తిగా

ఏ మాత్రం ఏ చోటా రాజీ పడలేక

చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చెమర్చేలా

గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కనులను విచ్చేలా

కలల్లోనైనా కన్నామా ...కథనైనా విన్నామా

ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా



అందాల కుందనపు బొమ్మవని

జత చేరుకున్న ఆ చందురుని

వందేళ్ల బంధమై అల్లుకుని

చేయందుకోవటే ఓ రమణీ





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment