Song » Mavichiguru Thinagane / మావిచిగురు తినగానే
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Talluri Rameswari / తాళ్ళూరి రాజేశ్వరి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
maaviciguru tinagaanE.. E E E kOvila palikEnaa?? maaviciguru tinagaanE.. E E E kOvila palikEnaa?? kOvila goMtu vinagaanE.. maaviciguru toDigEnaa? kOvila goMtu vinagaanE.. maaviciguru toDigEnaa? EmO..EmanunO gaanI..aamani..Ivani!! A..A maaviciguru tinagaanE.. E E E kOvila palikEnaa.. aa..aa..aa.. temmeratO taaraaTalaa.. tummedatO sayyaaTala.. a A..temmeratO taaraaTalaa.. tummedatO sayyaaTala!! taaraaTala..sayyaaTala.. sayyaaTala..taaraaTala.. vannelE kaadu, vagalE kaadu,enni nErcinadi monnaTi puvvu?? vannelE kaadu, vagalE kaadu,enni nErcinadi monnaTi puvvu?? biMkaalu.. biDiyaalu.. poMkaalu..pODumulu.. EmO..evvaridOgaanI I viri?? gaDasari!! A..A..A maaviciguru tinagaanE.. E E E kOvila palikEnaa.. aa..aa..aa.. kOvila palikEnaa?? okari oLLu uyyaala.. vErokari guMDe jaMpaala.. uyyaala..jaMpaala..jaMpaala..uyyaala.. okari oLLu uyyaala.. vErokari guMDe jaMpaala.. okari pedavi pagaDaalO..vErokari kanula diviTIlO.. okari pedavi pagaDaalO..vErokari kanula diviTIlO!! palakariMtalO.. pulakariMtalO palakariMtalO.. pulakariMtalO EmO..EmagunOgaanI I katha..mana katha!! maaviciguru tinagaanE.. E E E kOvila palikEnaa?? kOvila goMtu vinagaanE.. maaviciguru toDigEnaa? EmO..EmanunO gaanI..aamani..Ivani!! maaviciguru tinagaanE.. E E E kOvila palikEnaa.. aa..aa..aa.. kOvila palikEnaa??
మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా?? మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా?? కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా? కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా? ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!! ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ.. తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల.. అ ఆ..తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల!! తారాటల..సయ్యాటల.. సయ్యాటల..తారాటల.. వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు?? వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు?? బింకాలు.. బిడియాలు.. పొంకాలు..పోడుములు.. ఏమో..ఎవ్వరిదోగానీ ఈ విరి?? గడసరి!! ఆ..ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ.. కోవిల పలికేనా?? ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల.. ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల.. ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల.. ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో.. ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో!! పలకరింతలో.. పులకరింతలో పలకరింతలో.. పులకరింతలో ఏమో..ఏమగునోగానీ ఈ కథ..మన కథ!! మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా?? కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా? ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!! మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ.. కోవిల పలికేనా??
0 comments:
Post a Comment