Song » Samayaaniki tagu / సమయానికి తగు
Song Details:Actor :
Harikrishna / హరికృష్ణ ,Actress :
Simran / సిమ్రన్ ,
Soundarya / సౌందర్య ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Sunitha / సునీత ,
Vijay Yesudas / విజయ్ ఏసుదాసు ,Song Category : Others
a: samayAniki tagu sEvalu sEyanI nI SrIvArinI ||2| innALLugA SramiyiMcina illAlini ikasEviMcanI I SrIvArinI ... ||sama|| nAku nuvvu nIku nEnu anna tIpi mATatO cevilOna gusagusala cilipi valapu pATatO SrImatiki jarigEnu supraBAta sEva baMgAru nagalu miMcu bahu baMdhAlatO caluva caMdanAla miMcu callani nA cUputO ardhAMgi ki jarigEnu alaMkAra sEva.... ammalOni bujjagiMpu kalipina I buvvatO nAnnalOni UraDiMpu telisina I cEtitO nA pApaku jarigEnu naivEdyasEva...naivEdyasEva ||sama|| kalatalEni lOkaMlO diShTipaDani dIvilO ceDucErani cOTulO praSAMta parNaSAlalO I kAMtaku jarigEnu EkAMta sEva anubaMdame baMdhuvai...mamatale muttayiduvalai AnaMda bAShpAle anukOni atidhulai sItammaku jarigEnu sImaMtapusEva nuliveccani nA edapai paricETi pAnpulO kanureppala viMjAmara visirETi gAlitO cUlAliki jarigEnu jOlAli sEva... jOjOlAli sEva... A: SrIvAriki oka manavini sEyanI... I priyadAsinI SrIvAriki oka manavini sEyanI... I priyadAsinI kanuteravaga mIrUpE cUDAlani mI kaugiLlalO kanumUyAlani a: I kaugiLLalO kalisuMDAlani....
అ: సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారినీ ||2|| ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ఇకసేవించనీ ఈ శ్రీవారినీ ... ||సమ|| నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలు మించు బహు బంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో అర్ధాంగి కి జరిగేను అలంకార సేవ.... అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్యసేవ...నైవేద్యసేవ ||సమ|| కలతలేని లోకంలో దిష్టిపడని దీవిలో చెడుచేరని చోటులో ప్రశాంత పర్ణశాలలో ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబందమె బంధువై...మమతలె ముత్తయిదువలై ఆనంద బాష్పాలె అనుకోని అతిధులై సీతమ్మకు జరిగేను సీమంతపుసేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింజామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ... జోజోలాలి సేవ... ఆ: శ్రీవారికి ఒక మనవిని సేయనీ... ఈ ప్రియదాసినీ శ్రీవారికి ఒక మనవిని సేయనీ... ఈ ప్రియదాసినీ కనుతెరవగ మీరూపే చూడాలని మీ కౌగిళ్లలో కనుమూయాలని అ: ఈ కౌగిళ్ళలో కలిసుండాలని....
0 comments:
Post a Comment