Song » Idigo Rayalaseema gadda / ఇదిగో రాయలసీమ గడ్డ
Song Details:Actor :
Harikrishna / హరికృష్ణ ,Actress :Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pa: idigO rAyalasIma gaDDa... dIni kadha telusukO telugu biDDa ||3|| I gaDDalO pagalu segaloddurA... I maTTilO netturolakoddurA ||idigo|| ca: patita pAvanuDu tirupati vEMkaTESvaruDu... sarva rakShakuDu SrISaila mallESvaruDu... koluvunnadI sImalOnE raMkeliDu lEpAkShi basavanna SilpaM... raNaBEri ninadiMcu caMdragiri durgaM.... nelakonnAdI nElalOnE... ca: haruni kaMTikE kannarpiMcina kannappa BaktavaruDU vijaya nagara sAmrAjya duraMdhara kRuShNarAya BUvidhuDu caritra kekkina dharaNi idi.... padAlanE svarapadhAla naDipina annamayya kRutulu iha parAla kalipina vIrabrahmEMdra tatvagatulu alalai poMgina avani idi...||2|| aMdukE... ||I gaDDalO || ||idigo|| ca: telladorala haDalettiMcina uyyAla vADa narasiMhAreDDi kO: vaMdEmAtaraM maDama tippaka svarAjya saMgrAmaM naDipina kaDapa kOTareDDi.... kO: vaMdEmAtaraM gADicerla kallUri... sadASivaM pappUri haMpaNNa...liMgaNNa.. ShEkpIr rabiyAbi okkarA... iddarA ... padugurA...A nUrgurA... eMdareMdarO tyAgamOrtulaku janmamiccina janani yidi... ||idigo|| aMtaTi ciraMtana niraMtara vikasvara vaiBavaMtO virAjillina rAyalasIma ... mana raitannala sIma...InADu duShkara muShkara Saktula duraMtAlatO atalAkutalamavutuMTE cUstU uMTArA... cUstUnE uMTArA...kO: lEdu...lEdu.... ayitE... yuvata vikramiMcAli... navata viplaviMcAli... nAgoMtuna garjiMcE nAdamE mahAdyamamai kuLLina I vyavasdakE kottanetturekkiMcAli sarikotta carita sRuShTiMcAli.....||2||
ప: ఇదిగో రాయలసీమ గడ్డ... దీని కధ తెలుసుకో తెలుగు బిడ్డ ||౩|| ఈ గడ్డలో పగలు సెగలొద్దురా... ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా ||ఇదిగొ|| చ: పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు... సర్వ రక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు... కొలువున్నదీ సీమలోనే రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం... రణభేరి నినదించు చంద్రగిరి దుర్గం.... నెలకొన్నాదీ నేలలోనే... చ: హరుని కంటికే కన్నర్పించిన కన్నప్ప భక్తవరుడూ విజయ నగర సామ్రాజ్య దురంధర కృష్ణరాయ భూవిధుడు చరిత్ర కెక్కిన ధరణి ఇది.... పదాలనే స్వరపధాల నడిపిన అన్నమయ్య కృతులు ఇహ పరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర తత్వగతులు అలలై పొంగిన అవని ఇది...||౨|| అందుకే... ||ఈ గడ్డలో || ||ఇదిగొ|| చ: తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కో: వందేమాతరం మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటరెడ్డి.... కో: వందేమాతరం గాడిచెర్ల కల్లూరి... సదాశివం పప్పూరి హంపణ్ణ...లింగణ్ణ.. షేక్పీర్ రబియాబి ఒక్కరా... ఇద్దరా ... పదుగురా...ఆ నూర్గురా... ఎందరెందరో త్యాగమోర్తులకు జన్మమిచ్చిన జనని యిది... ||ఇదిగొ|| అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ ... మన రైతన్నల సీమ...ఈనాడు దుష్కర ముష్కర శక్తుల దురంతాలతో అతలాకుతలమవుతుంటే చూస్తూ ఉంటారా... చూస్తూనే ఉంటారా...కో: లేదు...లేదు.... అయితే... యువత విక్రమించాలి... నవత విప్లవించాలి... నాగొంతున గర్జించే నాదమే మహాద్యమమై కుళ్ళిన ఈ వ్యవస్దకే కొత్తనెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి.....||2||
0 comments:
Post a Comment