Sunday, July 5, 2020

Seetayya » Adisankarula      సీతయ్య » ఆదిశంకరుల

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Adisankarula / ఆదిశంకరుల
Song Details:Actor : Harikrishna / హరికృష్ణ  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : S.P.Charan / ఎస్.పి.చరణ్ ,  Sunitha / సునీత ,Song Category : Others
a: AdiSaMkarula sauMdaryalahari dEvulapalli lalitA gItA JarI

SrInAdha SRuMgAra lAhiri.. vETUri gEyAla mAdhuri

navalA Sauri yaMDamUri, ShellI ,kiTs... yaddanapUDi

eMdarO mahAnuBAvulu cUpina dAri

paTTAlsina piccE prEmarA... puTTAlsina ciccE prEmarA...

A: jIvitamE vaDabOsi.... anuBavamE kalabOsi

eMdarO mahAnuBAvulu cUpina dAri

ceyyAlsina tappE prEmarA... teliyAlsina noppE prEmarA...

a:aMdariki tellAritE sUryOdayaM

nAku mAtraM ninnu cUstEnE sUryOdayaM

muMcutuMdi prEma amRuta jalapAtaMlO

tElcutuMdi prEma AkASaMlO

A: moggutuMdi prEma mamatala tulasidaLaMtO

neggutuMdi prEma talarAtatO

a: manasu puTallO vayasE rAsE  rasavadgItE prEma

A: talapulatO talapaMDi... valapulanE tega vaMDi

eMdarO mahAnuBAvulu cUpinadAri

a: tiragAlsina malupE prEmarA

A: tiyyAlsina talupE prEmarA...

A edurugA nuvvuMTE guMDe daDa perugutuMdi

dUramaitE AgipOtuMdEmO

a: O...O...Oho....ADutuMdi prEma manasula maidAnaMlO

poMgutuMdi prEma madi dAnaMtO

O...O...O... pADutuMdi prEma Upiri kaccErilO

paDutuMdi prEma dastUritO

A: aDiginavannI manakaMdiMcE akShaya pAtrE prEma

a: kavitalanE divvelugA... BAvanalE velugulugA

eMdarO mahAnuBAvulu cupina dAri

A: edagAlsina ettE prEmarA....

a: kalagAlsina mattE prEmarA.....               ||Adi SaMkaru||
అ: ఆదిశంకరుల సౌందర్యలహరి దేవులపల్లి లలితా గీతా ఝరీ

శ్రీనాధ శృంగార లాహిరి.. వేటూరి గేయాల మాధురి

నవలా శౌరి యండమూరి, షెల్లీ ,కిట్స్... యద్దనపూడి

ఎందరో మహానుభావులు చూపిన దారి

పట్టాల్సిన పిచ్చే ప్రేమరా... పుట్టాల్సిన చిచ్చే ప్రేమరా...

ఆ: జీవితమే వడబోసి.... అనుభవమే కలబోసి

ఎందరో మహానుభావులు చూపిన దారి

చెయ్యాల్సిన తప్పే ప్రేమరా... తెలియాల్సిన నొప్పే ప్రేమరా...

అ:అందరికి తెల్లారితే సూర్యోదయం

నాకు మాత్రం నిన్ను చూస్తేనే సూర్యోదయం

ముంచుతుంది ప్రేమ అమృత జలపాతంలో

తేల్చుతుంది ప్రేమ ఆకాశంలో

ఆ: మొగ్గుతుంది ప్రేమ మమతల తులసిదళంతో

నెగ్గుతుంది ప్రేమ తలరాతతో

అ: మనసు పుటల్లో వయసే రాసే  రసవద్గీతే ప్రేమ

ఆ: తలపులతో తలపండి... వలపులనే తెగ వండి

ఎందరో మహానుభావులు చూపినదారి

అ: తిరగాల్సిన మలుపే ప్రేమరా

ఆ: తియ్యాల్సిన తలుపే ప్రేమరా...

ఆ ఎదురుగా నువ్వుంటే గుండె దడ పెరుగుతుంది

దూరమైతే ఆగిపోతుందేమో

అ: ఓ...ఓ...ఓహొ....ఆడుతుంది ప్రేమ మనసుల మైదానంలో

పొంగుతుంది ప్రేమ మది దానంతో

ఓ...ఓ...ఓ... పాడుతుంది ప్రేమ ఊపిరి కచ్చేరిలో

పడుతుంది ప్రేమ దస్తూరితో

ఆ: అడిగినవన్నీ మనకందించే అక్షయ పాత్రే ప్రేమ

అ: కవితలనే దివ్వెలుగా... భావనలే వెలుగులుగా

ఎందరో మహానుభావులు చుపిన దారి

ఆ: ఎదగాల్సిన ఎత్తే ప్రేమరా....

అ: కలగాల్సిన మత్తే ప్రేమరా.....               ||ఆది శంకరు||

0 comments:

Post a Comment