Monday, July 20, 2020

Santosham » Ne tolisarigaa      సంతోషం » నే తొలిసారిగా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ne tolisarigaa / నే తొలిసారిగా

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Gracy Sigh / గ్రేసీసింగ్ ,  Shreya / శ్రేయ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Usha / ఉష  ,Song Category : Others
pa: nE tolisArigA kalagannadi ninnEkadA
nAkaLledurugA nilucunnadI nuvvEkadA
svapnamA nuvvu satyamA tElci ceppavEM priyatamA
maunamO madhuragAnamO tanadi aDagavEM hRudayamA
iMtalO cEruvai aMtalO dUramai aMdavA...... snEhamA             ||nE tolisArigA||
ca: rekkalu toDigina talapu nuvvE kAdA nEstamA
ekkaDavAlanu ceppu nuvvE sAvAsamA
haddulu ceripina celimi nuvvai naDipE dIpamA
vaddaku rAkani ApakilA anurAgamA....
naDakalu nErpina ASavu kada taDabaDanIyaku kadalina kadha......
vetikE manasuku mamatE...paMcumA .....                                 ||nEtolisArigA||
ca:prEmA nItO paricayamE EdO pApamA
amRutamanukoni nammaTamE oka SApamA
nI oDi cErina prati madiki bAdhE PalitamA
tIyani rucigala kaTika viShaM nuvvEsumA
pedavulapai cirunavvula dagA .... kanabaDanIyavu nippulasega
nITiki Arani maMTalu rUpamA
nI ATEmiTO E nATiki Apavu kadA... nI bATEmiTO E jaMTakI cUpavu kadA....
teMcukOnIvu paMcukOnIvu iMta celagATamA
ceppukOnIvu tappukOnIvu nIku idi nyAyamA
pErulO praNayamA .... tIrulO praLayamA.... paMtamA... baMdhamA...
nI ATEmiTO EnATiki Apavu kadA....
nI bATEmiTO E jaMTakI cUpavu kadA......
ప: నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా...... స్నేహమా             ||నే తొలిసారిగా||
చ: రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడవాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా....
నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదలిన కధ......
వెతికే మనసుకు మమతే...పంచుమా .....                                 ||నేతొలిసారిగా||
చ:ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వేసుమా
పెదవులపై చిరునవ్వుల దగా .... కనబడనీయవు నిప్పులసెగ
నీటికి ఆరని మంటలు రూపమా
నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా... నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా....
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా .... తీరులో ప్రళయమా.... పంతమా... బంధమా...
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా....
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా......

0 comments:

Post a Comment