Sunday, July 12, 2020

Sambarala Rambabu » Poruginti Meenakshammanu      సంబరాల రాంబాబు » పొరుగింటి మీనాక్షమ్మను

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Poruginti Meenakshammanu / పొరుగింటి మీనాక్షమ్మను

Song Details:Actor : Chalam / చలం ,Actress : Shaarada / శారద ,Music Director : V.Kumar / వి.కుమార్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : P.Suseela / పి. సుశీల  ,  Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Others
pallavi:

    porugiMTi mInAkShammanu cUsArA

    vALLa Ayana cEsE muddu muccaTa vinnArA...

    mimmalnE...

    porugiMTi mInAkShammanu cUsArA

    vALLa Ayana cEsE muddu muccaTa vinnArA...

    pagalaMtA iddarakU tagavulu ennunnA...2

    cIkaTi paDitE pakkaki cEri rAjI kostADu

    kOrina cIralu istADu...

 porugiMTi mInAkShamma





    porugiMTi pullayya goDava eMduku lEvE...

    vADiki jItaM kaMTE gItaM ekkuva telusukOvE...

    AMDALLU...

    porugiMTi pullayya goDava eMduku lEvE...

    vADiki jItaM kaMTE gItaM ekkuva telusukOvE..

    tappani sarigA prati sinimAku veLatAvU muMdE..2

    jItaM kAstA sinimAkaitE migilidEmuMdE

    cIraku migilEdEmuMdE...

porugiMTi pullayya



caraNaM 1:

    peLLai mUDu ELLu gaDicinA poMdiMdEmiTi AMDALLu...

    peLLai mUDu ELLu gaDicinA poMdiMdEmiTi AMDALLu...

    tallI taMDrI prEma gurtu gA puTTenu bulli nAmAlu 2

    vagalanu cUpistArE gAni nagalepuDainA peTTArA 2

    O mutyAla bEsari icci mukkuki aMdaM teccArA....

    nA mukkuki aMdaM teccArA....

    udyOgaM oka meTTu dATanI kOrinadistA nIkU

    iShTaM lEdani ceppa kUDadA eMduku leMDi sAku....



    porugiMTi mInAkShamma



caraNaM 2:

    mATalatOTI recca goTTakE nannU....

    bediriMpulaku loMgE dAnni kAnU...

    kOpaM vastE maniShini kAnu nEnU...

    EM cEstAru..?

    cevulu melEstA..!! iMkEMcEstAru..?

    duMpa teMpEstA..!! A taruvAtA..!!

    tATa volustA...!! hA ha ha hA....!!!



    ||porugiMTi mInAkShamma||
పల్లవి:

    పొరుగింటి మీనాక్షమ్మను చూసారా

    వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

    మిమ్మల్నే...

    పొరుగింటి మీనాక్షమ్మను చూసారా

    వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

    పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా...2

    చీకటి పడితే పక్కకి చేరి రాజీ కొస్తాడు

    కోరిన చీరలు ఇస్తాడు...

 పొరుగింటి మీనాక్షమ్మ





    పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...

    వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...

    ఆండాళ్ళూ...

    పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...

    వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే..

    తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..2

    జీతం కాస్తా సినిమాకైతే మిగిలిదేముందే

    చీరకు మిగిలేదేముందే...

పొరుగింటి పుల్లయ్య



చరణం 1:

    పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...

    పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...

    తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు 2

    వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా 2

    ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా....

    నా ముక్కుకి అందం తెచ్చారా....

    ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ

    ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు....



    పొరుగింటి మీనాక్షమ్మ



చరణం 2:

    మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ....

    బెదిరింపులకు లొంగే దాన్ని కానూ...

    కోపం వస్తే మనిషిని కాను నేనూ...

    ఏం చేస్తారు..?

    చెవులు మెలేస్తా..!! ఇంకేంచేస్తారు..?

    దుంప తెంపేస్తా..!! ఆ తరువాతా..!!

    తాట వొలుస్తా...!! హా హ హ హా....!!!

    ||పొరుగింటి మీనాక్షమ్మ||

0 comments:

Post a Comment