Monday, July 20, 2020

Saira Narasimha Reddy » O .. saira      సైరా నరసింహా రెడ్ది » ఓ .. సైరా .

July 20, 2020 Posted by Publisher , No comments

Song » O .. saira / ఓ .. సైరా .

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Nayantara / నయన తార ,  Tamanna / తమన్నా ,Music Director : Amit Trivedi / అమిత్ త్రివేది  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,  Sunidhi Chouhan / సునిధీ చౌహాన్ ,Song Category : Inspiring & Motivational Songs
pavitra dhaatri bhaarataaMba 

muddu biDDavavuraa

uyyaalavaaDa naarasiMhuDaa..

charitra puTalu vismariMcha

veelulaeni veeraa

raenaaTiseema kanna sooryuDaa

 

mRtyuvae svaraana 

chiraayurasturanagaa

prasooti gaMDamae jayiMchinaavuraa

niMgi SirasuvaMchi 

namOstu neeku anagaa

navOdayaanivai janiMchinaavuraa

 

hO sairaa.. hO sairaa.. hO sairaa..

ushassu neeku oopiraayeraa

hO sairaa.. hO sairaa.. hO sairaa..

yasassu neeku roopamaayeraa

 

charaNaM 1

ahaMkariMchu aaMgla doralapaina

huMkariMchagalugu dhairyamaa

taloMchi batuku saaTivaarilOna

saahasaanni niMpu Sauryamaa

SRMkhalaalanae teMchukommani

svaechCha kOsamae Svaasanimmani

ninaadaM neevaeraa

 

okkokka biMduvalle janulanokkachOTa chaerchi

samudramalle maarchinaavuraa

prapaMchamoNikipOvu

penutuphaanulaaga veechi

doralni dhikkariMchinaavuraa

moTTamodaTi saari 

svataMtra samarabhaeri

peThillu mannadi 

prajaaLi pOridi

kaaLaraatri vaMTi paraayi paalanaanni

dahiMchu jvaalalO prakaaSamae idi

 

hO sairaa.. hO sairaa.. hO sairaa..

usassu neeku oopiraayeraa

hO sairaa.. hO sairaa.. hO sairaa..

yaSassu neeku roopamaayeraa

 

daasyaana jeeviMchaDaM kanna 

chaaveMtO maelaMdi nee paurushaM

manushulaitae manaM

aNichivaese juluM

oppukOkaMdi nee udyamaM

aalini biDDani ammani janmani

baMdhanaalanni odili saagudaaM

O.. nuvvae lakshalai okae lakshyamai

aTaevaeyani prati padaM

kadanaraMgamaMtaa kodamasiMgamalle

aakramiMchi vikramiMchi tarumutOMdiraa

ariveera saMhaaraa

 

hO sairaa.. hO sairaa.. hO sairaa..

hO sairaa.. hO sairaa.. hO sairaa..

ushassu neeku oopiraayeraa
పవిత్ర ధాత్రి భారతాంబ 
ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నారసింహుడా..
చరిత్ర పుటలు విస్మరించ
వీలులేని వీరా
రేనాటిసీమ కన్న సూర్యుడా
 
మృత్యువే స్వరాన 
చిరాయురస్తురనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి 
నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా
 
హో సైరా.. హో సైరా.. హో సైరా..
ఉషస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా.. హో సైరా.. హో సైరా..
యశస్సు నీకు రూపమాయెరా
 
చరణం 1
అహంకరించు ఆంగ్ల దొరలపైన
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని
స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవేరా
 
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమల్లె మార్చినావురా
ప్రపంచమొణికిపోవు
పెనుతుఫానులాగ వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి 
స్వతంత్ర సమరభేరి
పెఠిల్లు మన్నది 
ప్రజాళి పోరిది
కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
 
హో సైరా.. హో సైరా.. హో సైరా..
ఉషస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా.. హో సైరా.. హో సైరా..
యశస్సు నీకు రూపమాయెరా
 
చరణం 2
దాస్యాన జీవించడం కన్న 
చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం
అణిచివేసె జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలిని బిడ్డని అమ్మని జన్మని
బంధనాలన్ని ఒదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై
అటేవేయనీ ప్రతి పదం
కదనరంగమంతా కొదమసింగమల్లె
ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా
అరివీర సంహారా
 
హో సైరా.. హో సైరా.. హో సైరా..
హో సైరా.. హో సైరా.. హో సైరా..
ఉషస్సు నీకు ఊపిరాయెరా

0 comments:

Post a Comment