Monday, July 6, 2020

Sahasam svasaga sagipo » Chakori సాహసం శ్వాసగా సాగిపో » చకోరీ

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Chakori / చకోరీ
Song Details:Actor : Naga Chaitanya / నాగ చైతన్య ,Actress : Manjima Mohan / మంజిమా మోహన్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Satya Prakash / సత్య ప్రకాష్ ,  Shasha Tirupati / సాషా తిరుపతి ,Song Category : Love & Romantic Songs

పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి..

పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి..

పరువంలో రాదారి ఆకాశం అయిందే..

పైపైకెల్లాల్లన్నదే..చక్కోరి..

పదరా ఆ చోటుకీ ఈ చోటికంటానా..

నీతో ఏ చోటికైనా వెంట నే రానా..

చక్కోరి..పందెములో..పందెములో..

నే ముందరో నువు ముందరో చూద్దాం..చూద్దాం..

మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..

మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..

తొలిగా మౌనాలని మోగించగలదెవరో..

ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో..

ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే..

కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో..



ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి..

వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన..

ఇన్నాళ్లుగ దాగున్నది విరహం..

ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం..

అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన..

ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి..

వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన..

ఇన్నాళ్లుగ దాగున్నది విరహం..

ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం..

అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన..

చక్కోరి..పందెములో..పందెములో..

మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..

మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..



నిన్ను కోరి..నిన్ను కోరి..నిన్ను కోరి ఉన్నానురా..

నిన్ను కోరి ఉన్నానురా..నిన్ను కోరి..కోరి..

తోడై నువు తీయించిన పరుగులు..

నీడై నువు అందించిన వెలుగులు..

త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా..

బాగున్నది నీతో ఈ అనుభవం..

ఇంకా ఇది వందేళ్ళూ అవసరం..

నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా .. 
తోడై నువు తీయించిన పరుగులు..

నీడై నువు అందించిన వెలుగులు..

త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా..

బాగున్నది నీతో ఈ అనుభవం..

ఇంకా ఇది వందేళ్ళూ అవసరం..

నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా....



చక్కోరి..పందెములో..పందెములో..

మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..

మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..

తొలిగా మౌనాలని మోగించగలదెవరో..

ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో..

ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే..

కాలం ఎప్పుడో..ఆ క్షణం ఇంకెప్పుడో..

కాలం ఎప్పుడో..ఆ క్షణం ఇంకెప్పుడో..

క్షణం ఇంకెప్పుడో..క్షణం ఇంకెప్పుడో ..

0 comments:

Post a Comment