Tuesday, July 21, 2020

Rudraveena » Tharaliraada      రుద్రవీణ » తరలిరాద

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Tharaliraada / తరలిరాద

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sobhana / శోభన  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
taraliraada kanE vasaMtaM..tana darikiraani vanaalakOsaM

taraliraada kanE vasaMtaM..tana darikiraani vanaalakOsaM



gaganaala daakaa ala saagakuMTE..

mEGaalaraagaM ila cErukOdaa??



taraliraada kanE vasaMtaM..tana darikiraani vanaalakOsaM



vennela dIpaM koMdaridaa?? aDavini saitaM velugu kadaa!!

vennela dIpaM koMdaridaa?? aDavini saitaM velugu kadaa!!



ellalu lEni.. callani gaali..

aMdarikOsaM..aMdunukadaa!!



prati madini lEpE..prabhaataraagaM

padE padE cUpE ..pradhaana maargaM..



Edi soMtaM kOsaM kaadanu saMdEshaM..

paMcE guNamE pOtE prapaMcamE shUnyaM..

idi teliyani manugaDa katha dishanerugani gamanamu kadaa!!



taraliraada kanE vasaMtaM..tana darikiraani vanaalakOsaM



bratukuna lEni shruti kaladaa..edasaDilOnE layalEdaa??

bratukuna lEni shruti kaladaa..edasaDilOnE layalEdaa??



E kaLakainaa..E kalakainaa..

jIvitaraMgaM vEdika kaadaa!!



prajaadhanaM kaani..kaLaavilaasaM

E prayOjanaM lEni ..vRudhaa vikaasaM..



kUsE kOyila pOtE kaalaM aagiMdaa??

paarE ErE paaDE marO padaM raadaa??

muraLiki gala swaramuna kaLa pedavini viDi palakadu kada!!



taraliraada kanE vasaMtaM..tana darikiraani vanaalakOsaM



gaganaala daakaa ala saagakuMTE..

mEGaalaraagaM ila cErukOdaa??



taraliraada kanE vasaMtaM..tana darikiraani vanaalakOsaM
తరలిరాద కనే వసంతం..తన దరికిరాని వనాలకోసం

తరలిరాద కనే వసంతం..తన దరికిరాని వనాలకోసం



గగనాల దాకా అల సాగకుంటే..

మేఘాలరాగం ఇల చేరుకోదా??



తరలిరాద కనే వసంతం..తన దరికిరాని వనాలకోసం



వెన్నెల దీపం కొందరిదా?? అడవిని సైతం వెలుగు కదా!!

వెన్నెల దీపం కొందరిదా?? అడవిని సైతం వెలుగు కదా!!



ఎల్లలు లేని.. చల్లని గాలి..

అందరికోసం..అందునుకదా!!



ప్రతి మదిని లేపే..ప్రభాతరాగం

పదే పదే చూపే ..ప్రధాన మార్గం..



ఏది సొంతం కోసం కాదను సందేశం..

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం..

ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కదా!!



తరలిరాద కనే వసంతం..తన దరికిరాని వనాలకోసం



బ్రతుకున లేని శ్రుతి కలదా..ఎదసడిలోనే లయలేదా??

బ్రతుకున లేని శ్రుతి కలదా..ఎదసడిలోనే లయలేదా??



ఏ కళకైనా..ఏ కలకైనా..

జీవితరంగం వేదిక కాదా!!



ప్రజాధనం కాని..కళావిలాసం

ఏ ప్రయోజనం లేని ..వృధా వికాసం..



కూసే కోయిల పోతే కాలం ఆగిందా??

పారే ఏరే పాడే మరో పదం రాదా??

మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదు కద!!



తరలిరాద కనే వసంతం..తన దరికిరాని వనాలకోసం



గగనాల దాకా అల సాగకుంటే..

మేఘాలరాగం ఇల చేరుకోదా??



తరలిరాద కనే వసంతం..తన దరికిరాని వనాలకోసం

0 comments:

Post a Comment