Tuesday, July 21, 2020

Rudraveena » Randi Randi      రుద్రవీణ » రండి రండి

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Randi Randi / రండి రండి

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sobhana / శోభన  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Others
raMDi raMDi raMDi dayacEyaMDi
tamari raaka maakeMtO saMtOShaM sumaMDi
raMDi raMDi raMDi dayacEyaMDi
tamari raaka maakeMtO saMtOShaM sumaMDi



nE ceppaagaa mIku naannagaari tIru
iShTulaina vaaLLostE paTTalEni huShaaru
palakariMputOTE manasumITagalaru
ullaasaaniki maa I illu raacanagaru



tamarEnaa sUrya ilaa kUrcOMDayyaa
agaMDi agaMDi agaMDi vaddu kUrcOkaMDi akkaDa
tagina cOTukaadidi tamabOTi vaarikikkaDa



I gadilO naannagaaru vaayidaala varaalayya
gaDapadaaTi iTuvastE vaari pEru svaraalayya



klayiMTlu kaMpleMTlu klayiMTlu kaMpleMTlu masalE I gadi baaru
takkina naa gRuhamaMta gaana kaLaku darbaaru



raMDi raMDi raMDi dayacEyaMDi
tamari raaka maakeMtO saMtOShaM sumaMDi



baruvu moyyalEnappuDu kirru karrumaMTU
baruvu moyyalEnappuDu kirru karrumaMTU
cirruburrulaaDaTaM kurcIlaku aacaraM
atmIyulu vaccinappuDu a cappuDu apacaaraM
vaccina mitrulakOsaM muccaTagaa uMTuMdani
saMgItaM palikiMcE spriMgulatO cEyiMcaa
kacErIlu cEsE kurcI idi elaa uMdi
baavuMdaMDi



gaanakaLa ilavElpugaa vunna maa iMTa
Sunakamainaa paluku kanakaaMgi raagaana
icaTa puTTina ciguru kOmmainaa cEva
gaalainaa kadalaaDu sarigamala trOva



raavOy raa idigO IyanE surya ImE naa bhaarya
I iMTiki edurulEni Elika naa missessu
argumeMTu vinakuMDaa tIrpiccE jasTissu



caallEMDi sarasaM ELLu mudurutunna koddI



tiDitE tiTTEvu gaani taaLaMlO tiTTu
takatO takiTatOM tarikiTatOM taka takiTatOM  
svaraalayya saaMpradaaya kIrtini nilabeTTu



peDataa pO peDataa pogapeDataa paDakapeDataa
kottavaaLLa muMdeTI vELaakOLaM
evarEmanukuMTaarO teliyani mELaM



evarO paraayi vaaru kaadamma Iyana
sUryaM gaarani ceppaanE ayanE Iyana



raMDi raMDi raMDi dayacEyaMDi
tamari raaka maakeMtO saMtOShaM sumaMDi



vRuddaapyaMtO maMcaMpaTTi taaLaMtappakaa daggaDamannadi
aMcelaMcelugaa saadhiMcina maa taMDri peMcalayya
Kallu Kalluna vaccEcappuDu Gallu Galluna maarcE vidya
kaalakShEpaM vaariki paapaM a naalugu gODaalamadya
idigO maa panammayi dIni pEru pallavi



dIni kUni raagaMtO maaku rOju praaraMbhaM 
maa iMTlO saMdaDiki IpillE mari pallavi
 
raMDi raMDi dayacEyaMDi
tamari raaka maakeMtO saMtOShaM sumaMDi



pOsT pOsT pOsT pOsT
vaavilaala vaaralayya bie, el el bi pOsT pOsT pOsT pOsT
maa iMTiki muMdunnavi kaavu raati meTlu



raMDi raMDi raMDi raMDi raMDi raMDi
maaku nilayavidwaaMsulu cilakaraajugaaru
kIravaaNi viripEru paluku tEnelUru



navvu muvvakaTTi pratinimuShaannI tULListU
saMbaraala sImalOki prati aDugu maLListU
idE maadhuri sudhaamaadhuri paMcaDamE paramaardhaM
adE adE naa siddaaMtaM



gaanaM aMTE oka kaLagaanE telusu innaaLLu naaku
bratuku paaTagaa maarcinaMduku jOhaaridigO mIku
saMgItaMlO paaDataaranE anukuMTunnaa innaaLLu
saMgItaMlO maaTalaaDaDaM daa daa pada pada pada
maaTalanE saMgatulu ceyyaDaM
pani panipanisari panisarigaa
saMgatulE sadgatulanukOvaDaM
sarisari sarisari sarisari sarisarigaa sarisarigaa
saarigaa telusukunnaanu InaaDu
selavippistE veLLostaa maLLI maLLI vastuMTaa.. a.. haa
రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి
రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి



నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు
ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు
పలకరింపుతోటే మనసుమీటగలరు
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు



తమరేనా సూర్య ఇలా కూర్చోండయ్యా
అగండి అగండి అగండి వద్దు కూర్చోకండి అక్కడ
తగిన చోటుకాదిది తమబోటి వారికిక్కడ



ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య
గడపదాటి ఇటువస్తే వారి పేరు స్వరాలయ్య



క్లయింట్లు కంప్లెంట్లు క్లయింట్లు కంప్లెంట్లు మసలే ఈ గది బారు
తక్కిన నా గృహమంత గాన కళకు దర్బారు



రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి



బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ
బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ
చిర్రుబుర్రులాడటం కుర్చీలకు ఆచరం
అత్మీయులు వచ్చినప్పుడు అ చప్పుడు అపచారం
వచ్చిన మిత్రులకోసం ముచ్చటగా ఉంటుందని
సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా
కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది
బావుందండి



గానకళ ఇలవేల్పుగా వున్న మా ఇంట
శునకమైనా పలుకు కనకాంగి రాగాన
ఇచట పుట్టిన చిగురు కోమ్మైనా చేవ
గాలైనా కదలాడు సరిగమల త్రోవ



రావోయ్ రా ఇదిగో ఈయనే సుర్య ఈమే నా భార్య
ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సు
అర్గుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సు



చాల్లేండి సరసం ఏళ్ళు ముదురుతున్న కొద్దీ



తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు
తకతో తకిటతోం తరికిటతోం తక తకిటతోం  
స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు



పెడతా పో పెడతా పొగపెడతా పడకపెడతా
కొత్తవాళ్ళ ముందెటీ వేళాకోళం
ఎవరేమనుకుంటారో తెలియని మేళం



ఎవరో పరాయి వారు కాదమ్మ ఈయన
సూర్యం గారని చెప్పానే అయనే ఈయన



రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి



వృద్దాప్యంతో మంచంపట్టి తాళంతప్పకా దగ్గడమన్నది
అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్య
ఖల్లు ఖల్లున వచ్చేచప్పుడు ఘల్లు ఘల్లున మార్చే విద్య
కాలక్షేపం వారికి పాపం అ నాలుగు గోడాలమద్య
ఇదిగో మా పనమ్మయి దీని పేరు పల్లవి



దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం 
మా ఇంట్లో సందడికి ఈపిల్లే మరి పల్లవి




రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి



పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్
వావిలాల వారలయ్య బిఎ, ఎల్ ఎల్ బి పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్
మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు



రండి రండి రండి రండి రండి రండి
మాకు నిలయవిద్వాంసులు చిలకరాజుగారు
కీరవాణి విరిపేరు పలుకు తేనెలూరు



నవ్వు మువ్వకట్టి ప్రతినిముషాన్నీ తూళ్ళిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ
ఇదే మాధురి సుధామాధురి పంచడమే పరమార్ధం
అదే అదే నా సిద్దాంతం



గానం అంటే ఒక కళగానే తెలుసు ఇన్నాళ్ళు నాకు
బ్రతుకు పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు
సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు
సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద
మాటలనే సంగతులు చెయ్యడం
పని పనిపనిసరి పనిసరిగా
సంగతులే సద్గతులనుకోవడం
సరిసరి సరిసరి సరిసరి సరిసరిగా సరిసరిగా
సారిగా తెలుసుకున్నాను ఈనాడు
సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ వస్తుంటా.. అ.. హా

0 comments:

Post a Comment