Monday, July 20, 2020

Rudraveena » Lalitha Priya      రుద్రవీణ » లలిత ప్రియ

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Lalitha Priya / లలిత ప్రియ

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sobhana / శోభన  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  K. Jesudasu / కె. జేసుదాసు  ,Song Category : Love & Romantic Songs
lalita priya kamalaM virisinadi..

lalita priya kamalaM virisinadi..kannula kolanii..A A A 



udaya ravikiraNaM merisinadi.. Uhala jagatini..A A A

udaya ravikiraNaM merisinadi!!



amRuta kalashamugaa pratinimiShaM..

amRuta kalashamugaa pratinimiShaM..

kalimiki dorakani celimini kurisina arudagu varamidi!!



lalita priya kamalaM virisinadi..



rEyi pavalu kalipE sUtraM saaMdhyaraagaM.. kaadaa nIlO naalO poMgE praNayaM

nEla niMgi kalipE baMdaM iMdradaapaM.. kaadaa mana snEhaM muDivEsE paruvaM..



kalala virula vanaM.. mana hRudayaM

kalala virula vanaM.. mana hRudayaM

valacina Amani kUrimi mIraga cErina taruNaM!!



kOTi talapula civurulu toDigenu.. tETi swaramula madhuvulu cilikenu

tIpi palukula cilukala kilakila.. tIga sogasula toNikina milamila



paaDutunnadi edamuraLi, raagaJari taragala mRuduravaLi

tUgutunnadi marulavanI lEta viri kulukula naTanagani

vEla madhumaasamula pUla darahaasamula masasulu murisenu!!



lalita priya kamalaM virisinadi..kannula kolanii..A A A 

udaya ravikiraNaM merisinadi!!



kOrE kOvela dwaaraM nIvai cErukOga.. kaadaa nIkai mrOgE praaNaM praNavaM..

tIsE shwaasE dhUpaM cUsE dIpaM.. kaadaa mamakaaraM nI pUjaa kusumaM..



manasu himagirigaa maarinadi..

manasu himagirigaa maarinadi..

kalasina mamatala swarajati pashupati padagati kaagaa!!



mEni malupula celuvapu gamanamu.. vINapalikina bilibili gamakamu

kaali muvvaga nilicenu kaalamu..pUla pavanamu vEsEnu taaLamu

gEyamainadi toli praayaM.. raayamani maayani madhukaavyaM

swaagaciMcenu prEma pathaM.. saaginadi iruvuri bratukurathaM

kOrikala taarakala sImalaku cErukone vaDi vaDi paruviDi!!



udaya ravikiraNaM merisinadi.. Uhala jagatini..A A A

lalita priya kamalaM virisinadi..kannula kolanii..A A A 



lalita priya kamalaM virisinadi!!
లలిత ప్రియ కమలం విరిసినది..

లలిత ప్రియ కమలం విరిసినది..కన్నుల కొలనిఇ..ఆ ఆ ఆ 



ఉదయ రవికిరణం మెరిసినది.. ఊహల జగతిని..ఆ ఆ ఆ

ఉదయ రవికిరణం మెరిసినది!!



అమృత కలశముగా ప్రతినిమిషం..

అమృత కలశముగా ప్రతినిమిషం..

కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది!!



లలిత ప్రియ కమలం విరిసినది..



రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం.. కాదా నీలో నాలో పొంగే ప్రణయం

నేల నింగి కలిపే బందం ఇంద్రదాపం.. కాదా మన స్నేహం ముడివేసే పరువం..



కలల విరుల వనం.. మన హృదయం

కలల విరుల వనం.. మన హృదయం

వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం!!



కోటి తలపుల చివురులు తొడిగెను.. తేటి స్వరముల మధువులు చిలికెను

తీపి పలుకుల చిలుకల కిలకిల.. తీగ సొగసుల తొణికిన మిలమిల



పాడుతున్నది ఎదమురళి, రాగఝరి తరగల మృదురవళి

తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని

వేల మధుమాసముల పూల దరహాసముల మససులు మురిసెను!!



లలిత ప్రియ కమలం విరిసినది..కన్నుల కొలనిఇ..ఆ ఆ ఆ 

ఉదయ రవికిరణం మెరిసినది!!



కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ.. కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం..

తీసే శ్వాసే ధూపం చూసే దీపం.. కాదా మమకారం నీ పూజా కుసుమం..



మనసు హిమగిరిగా మారినది..

మనసు హిమగిరిగా మారినది..

కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా!!



మేని మలుపుల చెలువపు గమనము.. వీణపలికిన బిలిబిలి గమకము

కాలి మువ్వగ నిలిచెను కాలము..పూల పవనము వేసేను తాళము

గేయమైనది తొలి ప్రాయం.. రాయమని మాయని మధుకావ్యం

స్వాగచించెను ప్రేమ పథం.. సాగినది ఇరువురి బ్రతుకురథం

కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి!!



ఉదయ రవికిరణం మెరిసినది.. ఊహల జగతిని..ఆ ఆ ఆ

లలిత ప్రియ కమలం విరిసినది..కన్నుల కొలనిఇ..ఆ ఆ ఆ 



లలిత ప్రియ కమలం విరిసినది!!

0 comments:

Post a Comment