Friday, July 17, 2020

Rudraveena » Cheppalani Vundi      రుద్రవీణ » చెప్పాలని ఉంది

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Cheppalani Vundi / చెప్పాలని ఉంది

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sobhana / శోభన  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
oMTarigaa digulu baruvu mOyabOku nEstaM
maunaM cUpistuMdaa samasyalaku maargaM
kaShTaM vastEnE gada guMDe balaM telisEdi
duHKaaniki talavaMcitE telivi kiMka viluvEdi
maMcainaa ceDDainaa paMcukOnu mElaina
aa maatraM aatmIyatakainaa panikiraanaa
evvaritO EmaatraM paMcukOnu vIlulEni
aMtaTi EkaaMtamaina ciMtalEmiTaMDiceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
guMDellO suDi tirigE kalata kathalu
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi kOkilala kuTuMbaMlO ceDabuTTina kaakini ani
ayinavaaLLu velivEstE ayinaa nEnEkaakini
kOkilala kuTuMbaMlO ceDabuTTina kaakini ani
ayinavaaLLu velivEstE ayinaa nEnEkaakini
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
paata baaTa maaraalani ceppaTamEnaa nEraM
gUDu viDici pommannadi nannu kanna mamakaaraM
vasaMtaala aMdaM virabUsE aanaMdaM
tETi tEne paaTa paMcevannela viritOTa
bratuku pustakaMlO idi okaTEnaa puTa
maniShi naDucu daarullO lEdaa E muLLabaaTa
maniShi naDucu daarullO lEdaa E muLLabaaTa
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi ETi poDugunaa vasaMtamokaTEnaa kaalaM
EdI mari migataa kaalaalaku taaLaM
niTTUrpula vaDagaalula shRutilO okaDu
kaMTi nITi kuMBavRuShTi jaDilO iMkokaDu
maMcu vaMcenaku moDai gODu peTTu vaaDokaDu
vIri goMtulOni kEka venuka unnadE raagaM
anukShaNaM veMTaaDE aavEdana E naadaM
ani aDigina naa praSnaku aligi matta kOkila
kaLLu unna kabOdilaa cevulu unna badhiruDilaa
nUtilOni kappalaa bratakamanna shaasanaM
kaadannaMduku akkaDa karuvaayenu naa sthaanaM
ceppaalani uMdi goMtuvippaalani uMdi 
ceppaalani uMdi goMtuvippaalani uMdi asahaayatalO daDa daDa laaDE hRudayamRudaMga dhwaanaM
naaDula naDakala taDabaDi saagE artula aarani shOkaM
eDaari bratukula nityaM castU saagE bhaadala biDaaru
dikku mokku teliyani dInula yadhaardha jIvan swaraalu
niluvunaa nannu kammutunnaayi shaaMtitO niluvanIyakunnaayi
I tIgalu savariMcaali I apashRuti sariceyyaali
jana gItini vaddanukuMTu naaku nEnE haddanukuMTU
kalalO jIvuMcanu nEnu kalavariMta kOranu nEnu
nEnu saitaM vishwavINaku taMtrinai mUrca nalupOtaanu
nEnu saitaM bhuvana GOShaku verri goMtuka vicci mrOstaanu
nEnu saitaM prapaMcaadhyapu tella rEkai pallavistaanu
nEnu saitaM nEnu saitaM bratuku baaTaku goMtu kalipEnu
nEnu saitaM nEnu saitaM bratuku baaTaku goMtu kalipEnu
sakala jagatini shaashwataMgaa vasaMtaM variyiMcudaakaa
prati maniShiki jIvanaMlO naMdanaM vikasiMcudaakaa
paatapaaTanu paaDalEnu kotta baaTanu vIDipOnu 
paatapaaTanu paaDalEnu kotta baaTanu vIDipOnu 
nEnu saitaM nEnu saitaM nEnu saitaM
nEnu saitaM nEnu saitaM nEnu saitaM
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివి కింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైన
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
గుండెల్లో సుడి తిరిగే కలత కథలు
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
 
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
పాత బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
 
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచెనకు మొడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల
కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
చెప్పాలని ఉంది గొంతువిప్పాలని ఉంది 
 
అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే అర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకుల నిత్యం చస్తూ సాగే భాదల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యధార్ధ జీవన్ స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి

ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటు నాకు నేనే హద్దనుకుంటూ
కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చ నలుపోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాధ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాతపాటను పాడలేను కొత్త బాటను వీడిపోను 
పాతపాటను పాడలేను కొత్త బాటను వీడిపోను 
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం

0 comments:

Post a Comment