Friday, July 10, 2020

Rojulu marayi » Eruvaka sagaro ranno      రోజులు మారాయ్ » ఏరువాక సాగారో రన్నో

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Eruvaka sagaro ranno / ఏరువాక సాగారో రన్నో
Song Details:Actor :Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
kallA kapaTaM kAnani vADa lOkaM pOkaDa teliyani vADa
EruvAka sAgArO rannO - cinnanna
ca: 1. nava dhAnyAlanu gaMpakettukuni
caddi annamu mUTagaTTukuni (2)
mullugarranu cEtabaTTukuni
illAlunu nI veMTabeTTukuni
illAlunu nI veMTabeTTukuni EruvAka
ca:2. paTamaTa dikkuna varada guDEse
urumula merupula vAnala kurise (2)
vAgulu vaMkalu uravaDi jEsi
eMDina jILu iguLLu vEsi  EruvAka
ca:3.kOTErunu sarijUsi ennukO
elapaDa dApaTa eDla dOlukO
pAludappika koMDradunnukO
vittanammulisiri siri callukO EruvAka
ca:4. polAlammukuni pOyEvAru
TaunulO mEDalu kaTTEvAru
byAMkulO Dabbulu dAcEvAru
nI Saktini gamaniMcaru vAru  EruvAka
ca:5. palleTULLalO cellanivALLu
pAliTiks lO bratikEvALLu
prajAsEvayani aracEvALLu prajA
oLLu vaMci cAkiriki maLLaru  EruvAka
padavulu sthiramani BramisE vALLE
OTlu guMji ninu maricE vALLE
nIvE dikkani vatturu padavOy (2)
rOjulu mArAy rOjulu mArAy
mArAy mArAy mArAy
rOjulu mArAy EruvAka
 
Click here to hear the song
కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ
ఏరువాక సాగారో రన్నో - చిన్నన్న
చ: 1. నవ ధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది అన్నము మూటగట్టుకుని (2)
ముల్లుగర్రను చేతబట్టుకుని
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని ఏరువాక
చ:2. పటమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానల కురిసె (2)
వాగులు వంకలు ఉరవడి జేసి
ఎండిన జీళు ఇగుళ్ళు వేసి  ఏరువాక
చ:3.కోటేరును సరిజూసి ఎన్నుకో
ఎలపడ దాపట ఎడ్ల దోలుకో
పాలుదప్పిక కొండ్రదున్నుకో
విత్తనమ్ములిసిరి సిరి చల్లుకో ఏరువాక
చ:4. పొలాలమ్ముకుని పోయేవారు
టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బులు దాచేవారు
నీ శక్తిని గమనించరు వారు  ఏరువాక
చ:5. పల్లెటూళ్ళలో చెల్లనివాళ్ళు
పాలిటిక్స్ లో బ్రతికేవాళ్ళు
ప్రజాసేవయని అరచేవాళ్ళు ప్రజా
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు  ఏరువాక
పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే
ఓట్లు గుంజి నిను మరిచే వాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవోయ్ (2)
రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్ మారాయ్ మారాయ్
రోజులు మారాయ్ ఏరువాక


 

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment