Song » Mandaramlo / మందారంలో
Song Details:Actor :
Naresh / నరేష్ ,
Pradeep / ప్రదీప్ ,
Rajesh (Ananda Bhairavi) / రాజేశ్ (ఆనంద భైరవి) ,
Shubhakar / శుభాకర్ ,Actress :
Mahalakshmi / మహాలక్ష్మి ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi: maMdAraMlO GumaGumalai.. makaraMdaMlO madhurimalai maMtrAkSharamai dIviMcEdi.. manamai manadai jIviMcEdi prEma.. prEma.. prEma.. caraNaM 1: gaMgalAga poMgi vacci.. yamunalAga saMgamiMci gaMgalAga poMgi vacci.. yamunalAga saMgamiMci kaugililO kASI kShEtraM.. SivaSaktula tAMDava nRutyaM kaugililO kASI kShEtraM.. SivaSaktula tAMDava nRutyaM nilici.. valapu paMDiMcEdi.. ninnu nannu bratikiMcEdi.. prEma.. prEma.. prEma.. anurAgAniki parimaLamai.. ArAdhanaki sumagaLamai.. vEdASIssulu kuripiMcEdi.. vEyi uShassulu veligiMcEdi.. prEma.. prEma.. prEma.. caraNaM 2: oka prEma amRuta SilpaM.. oka prEma budduDi rUpaM oka prEma rAmacaritraM.. oka prEma gAMdhI tatvaM oka prEma amRuta SilpaM.. oka prEma buddhuDi rUpaM oka prEma rAmacaritraM.. oka prEma gAMdhI tatvaM citinainA ciguriMcEdi.. mRutinainA bratikiMcEdi.. prEma.. prEma.. prEma.. nEnunnAni kOrEdI..I.. nIvE nEnani nIDayyEdI..I.. kammaga callaga kanipiMcEdi.. brahmani saitaM kani peMcEdi.. prEma.. prEma.. prEma.. maMdAraMlO GumaGumalai.. makaraMdaMlO madhurimalai maMtrAkSharamai dIviMcEdi.. manamai manadai jIviMcEdi prEma.. prEma prEma.. prEma.. prEma prEma.. prEma.. prEma prEma.. hm.. cUDaMDi.. mAgAya mahApaccaDi.. perugEstE mahattari.. adi vEstE aDDa vistari mAninyA mahAsuMdari.. annAru kadaMDi.. aMdukE alA pADAnanamATa.. hahaha..
పల్లవి: మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. చరణం 1: గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి కౌగిలిలో కాశీ క్షేత్రం.. శివశక్తుల తాండవ నృత్యం కౌగిలిలో కాశీ క్షేత్రం.. శివశక్తుల తాండవ నృత్యం నిలిచి.. వలపు పండించేది.. నిన్ను నన్ను బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. అనురాగానికి పరిమళమై.. ఆరాధనకి సుమగళమై.. వేదాశీస్సులు కురిపించేది.. వేయి ఉషస్సులు వెలిగించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. చరణం 2: ఒక ప్రేమ అమృత శిల్పం.. ఒక ప్రేమ బుద్దుడి రూపం ఒక ప్రేమ రామచరిత్రం.. ఒక ప్రేమ గాంధీ తత్వం ఒక ప్రేమ అమృత శిల్పం.. ఒక ప్రేమ బుద్ధుడి రూపం ఒక ప్రేమ రామచరిత్రం.. ఒక ప్రేమ గాంధీ తత్వం చితినైనా చిగురించేది.. మృతినైనా బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. నేనున్నాని కోరేదీ..ఈ.. నీవే నేనని నీడయ్యేదీ..ఈ.. కమ్మగ చల్లగ కనిపించేది.. బ్రహ్మని సైతం కని పెంచేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది ప్రేమ.. ప్రేమ ప్రేమ.. ప్రేమ.. ప్రేమ ప్రేమ.. ప్రేమ.. ప్రేమ ప్రేమ.. హ్మ్.. చూడండి.. మాగాయ మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి.. అది వేస్తే అడ్డ విస్తరి మానిన్యా మహాసుందరి.. అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట.. హహహ..
0 comments:
Post a Comment