Thursday, July 23, 2020

Ramudu Kadu Krishnudu » Choosaaka Ninu      రాముడు కాదు కృష్ణుడు » చూసాకా నిను

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Choosaaka Ninu / చూసాకా నిను

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Jayaprada / జయప్రద ,  Sridevi / శ్రీదేవి ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
oka saMdhyA samayAna..

dikkutOcaka nE 

dikkulanni cUcucuMDa

uttara dikkuna merisenoka

tAraka..adi tArakO..

mEnakO..nA aBisArikO..



cUsAkA ninu cUsAkA..

cUsAkA ninu cUsAkA..

AgalEka..manasApukOlEkA..

rAsAnu oka lEKa

aMdukO I prEmalEKa..

aMdiMcu SuBalEKa



cUsAka ninu cUsAka..



aMdamaMtA Erci kUrci 

akSharAluga pErcinAnu

aMdamaMtA Erci kUrci 

akSharAluga pErcinAnu

manasulOniki toMgi cUsi 

BAvamaMtA kUrcinAnu

manasulOniki toMgi cUsi

BAvamaMtA kUrcinAnu



nI kanulalO..

nA kanulu kalipinAnU

nI aDugulO..

nEnu aDuguvEsinAnU

I uttaraM..nA jIvitaM..

nI saMtakaM..nA jAtakaM



cUsAkA ninu cUsAkA..

AgalEka..manasApukOlEkA..

rAsAnu oka lEKa

aMdukO I prEmalEKa..

aMdiMcu SuBalEKa



BAvamaMtA mArci mArci..

BArataMlA caduvukunnA

BAvamaMtA mArci mArci..

BArataMlA caduvukunnA

baruvu guMDela rAta cUsi..

bAdhanaMtA pOlcukunnA

baruvuguMDela rAta cUsi..

bAdhanaMtA pOlcukunnA



nI cUpulO..

nA rUpu cUsinAnU

nA guMDelO..

nI mUrti nilipinAnU

I mATalE nA uttaraM..

I pilupulE nA saMtakaM ..



cUsAkA ninu cUsAkA..

cUsAkA ninu cUsAkA..

AgalEka..manasApukOlEkA..

cUsAnu nI lEKa

cadivAlE civaridAkA..

paMpistA SuBalEKa



cUsAkA ninu cUsAkA..

cUsAkA ninu cUsAkA..

AgalEka..manasApukOlEkA..

rAsAnu oka lEKa..

cUsAnu A lEKa
ఒక సంధ్యా సమయాన..

దిక్కుతోచక నే 
దిక్కులన్ని చూచుచుండ

ఉత్తర దిక్కున మెరిసెనొక

తారక..అది తారకో..

మేనకో..నా అభిసారికో..



చూసాకా నిను చూసాకా..

చూసాకా నిను చూసాకా..

ఆగలేక..మనసాపుకోలేకా..

రాసాను ఒక లేఖ

అందుకో ఈ ప్రేమలేఖ..

అందించు శుభలేఖ



చూసాక నిను చూసాక..



అందమంతా ఏర్చి కూర్చి 

అక్షరాలుగ పేర్చినాను

అందమంతా ఏర్చి కూర్చి 

అక్షరాలుగ పేర్చినాను

మనసులోనికి తొంగి చూసి 

భావమంతా కూర్చినాను

మనసులోనికి తొంగి చూసి

భావమంతా కూర్చినాను



నీ కనులలో..

నా కనులు కలిపినానూ

నీ అడుగులో..

నేను అడుగువేసినానూ

ఈ ఉత్తరం..నా జీవితం..

నీ సంతకం..నా జాతకం



చూసాకా నిను చూసాకా..

ఆగలేక..మనసాపుకోలేకా..

రాసాను ఒక లేఖ

అందుకో ఈ ప్రేమలేఖ..

అందించు శుభలేఖ



భావమంతా మార్చి మార్చి..

భారతంలా చదువుకున్నా

భావమంతా మార్చి మార్చి..

భారతంలా చదువుకున్నా

బరువు గుండెల రాత చూసి..

బాధనంతా పోల్చుకున్నా

బరువుగుండెల రాత చూసి..

బాధనంతా పోల్చుకున్నా



నీ చూపులో..

నా రూపు చూసినానూ

నా గుండెలో..

నీ మూర్తి నిలిపినానూ

ఈ మాటలే నా ఉత్తరం..

ఈ పిలుపులే నా సంతకం ..



చూసాకా నిను చూసాకా..

చూసాకా నిను చూసాకా..

ఆగలేక..మనసాపుకోలేకా..

చూసాను నీ లేఖ

చదివాలే చివరిదాకా..

పంపిస్తా శుభలేఖ



చూసాకా నిను చూసాకా..

చూసాకా నిను చూసాకా..

ఆగలేక..మనసాపుకోలేకా..

రాసాను ఒక లేఖ..

చూసాను ఆ లేఖ

0 comments:

Post a Comment