Friday, July 10, 2020

Ramudu Bheemudu » Saradaa saradaa      రాముడు భీముడు » సరదా సరదా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Saradaa saradaa / సరదా సరదా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  L. Vijayalakshmi / ఎల్. విజయలక్ష్మి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Jamuna raani / జమునా రాణి ,  Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Others
maga : saradA saradA sigireTU idi doral tAgu bal sigareTTu...     ||2||
    paTTubaTTi oka dammu lAgitE svargAniki yidi toli meTTU        ||saradA||
ADa:  vA kaMpu goTTu I sigareTTu dInni kAlcakOyI nApai oTTU    ||kaMpu||
    kaDupu niMDunA kAlu niMDunA vadili peTTavOy nI paTTU    ||kaMpu||
maga:  I sigireTTutO AMjanEyuDu laMkA dahanaM cESADU
ADa:  hA evaDO kOtalu kOSADu
maga:  I poga tOTI guppu guppuna mEGAlu sRuShTiMcavaccU
ADa:    mIsAlu kAlcukOvaccU
maga :    ||a... saradA||
Ame:    Upiri tittula kyAnsarukidiyE kAraNamannAru DAkTarlu
maga:    kAdannArulE pedda yAkTarlu
Ame:    pasaru pErukoni kaPamu cErukoni usuru tIyu pommannArU
maga:    daddammalu adi vinnArU
Ame:    hA                    ||kaMpu||
maga:    pakkanunna vALLI suvAsanaku mukkulu egarEstAru
ADa:    vA..
maga:    nIverugavu dIni huShAru
ADa:    abbO thiyETarla lO poga tAgaDamE niShEdhiMcinAraMdukE
maga:    kalekShanlu lEvaMdukE            ||saradA||
ADa:    ||kaMpugoTTu||
maga:    kavitvAnikI sigireTTU kAPIkE yidi tObuTTu.
ADa:    paityAniki yI sigireTTU baDAyi kiMdA jamakaTTU
maga:    AnaMdAniki sigireTTU AlOcanalanu gilagoTTU
ADa:    panilEkuMTE sigireTTU tini kUrcuMTE pogabaTTU
maga:    ravvalu rAlcE rAkeTTU raMgu raMgulA pAkeTTU
ADa:    koMpalu kAlcE sigireTTU dIni goppa ceppa cIdara buTTU
maga:    ||saradA||
ADa:    ||kaMpugoTTu||
మగ : సరదా సరదా సిగిరెటూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు...     ||2||
    పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి యిది తొలి మెట్టూ        ||సరదా||
ఆడ:    వా కంపు గొట్టు ఈ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టూ    ||కంపు||
    కడుపు నిండునా కాలు నిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టూ    ||కంపు||
మగ:    ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడూ
ఆడ:    హా ఎవడో కోతలు కోశాడు
మగ:    ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ
ఆడ:    మీసాలు కాల్చుకోవచ్చూ
మగ :    ||అ... సరదా||
ఆమె:    ఊపిరి తిత్తుల క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లు
మగ:    కాదన్నారులే పెద్ద యాక్టర్లు
ఆమె:    పసరు పేరుకొని కఫము చేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
మగ:    దద్దమ్మలు అది విన్నారూ
ఆమె:    హా                    ||కంపు||
మగ:    పక్కనున్న వాళ్ళీ సువాసనకు ముక్కులు ఎగరేస్తారు
ఆడ:    వా..
మగ:    నీవెరుగవు దీని హుషారు
ఆడ:    అబ్బో థియేటర్ల లో పొగ తాగడమే నిషేధించినారందుకే
మగ:    కలెక్షన్లు లేవందుకే            ||సరదా||
ఆడ:    ||కంపుగొట్టు||
మగ:    కవిత్వానికీ సిగిరెట్టూ కాఫీకే యిది తోబుట్టు.
ఆడ:    పైత్యానికి యీ సిగిరెట్టూ బడాయి కిందా జమకట్టూ
మగ:    ఆనందానికి సిగిరెట్టూ ఆలోచనలను గిలగొట్టూ
ఆడ:    పనిలేకుంటే సిగిరెట్టూ తిని కూర్చుంటే పొగబట్టూ
మగ:    రవ్వలు రాల్చే రాకెట్టూ రంగు రంగులా పాకెట్టూ
ఆడ:    కొంపలు కాల్చే సిగిరెట్టూ దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ
మగ:    ||సరదా||
ఆడ:    ||కంపుగొట్టు||

0 comments:

Post a Comment