Song » Chanduruni Takinadi / చందురుని తాకినది
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Susmitha Sen / సుస్మితాసేన్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Hari Haran / హరిహరన్ ,
Sujatha / సుజాత ,Song Category : Others
pallavi : chaMduruni taakinadi aarm^ sTraaMgaa(2) are aarm^ sTraaMgaa... chekkilini dOchinadi naenaegaa... are naenaegaa... kalala daevatakee pedavi taaMboolaM immaMdi SRMgaaraM (2) IIchaMduruniII chaMduruni taakinadineevaegaa... are neevaegaa vennelani dOchinadi neevaegaa... are neevaegaa vayasu vaakilini teriche vayyaaraM nee kalala maMdaaraM Srutilayala SRMgaaraM charaNaM : 1 poovulaaMTi cheli oDilO puTTukochche sarigamalae (2) paiTachaaTu punnamilaa poMgae madhurimalae talapula velluvalO talagaDa adumukunnaa tanuvuni poduvukoni priyunae kalusukunnaa taapaala paMdirilO deepamalle velugutunnaa magasiri pilupulatO taenelaaga maarutunnaa kOrikala kOvelalO karpooramautunnaa IIchaMduruniII charaNaM : 2 rammanae pilupuvini raegutOMdi yavvanamae aekamai pOdaamaMToo jallutOMdi chaMdanamae neeTilOni chaepapilla neeTiki bhaaramaunaa kOrukunna priyasakhuDu kaugiliki bhaaramaunaa cheMtachaera vachchinaanae chaeyijaaripOkae pillaa pillagaaDi allarini Opalaedu kannepilla aligina magatanamae pagabaDitae veeDadae IIchaMduruniII
పల్లవి : చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా(2) అరె ఆర్మ్ స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా... కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2) ॥చందురుని॥ చందురుని తాకినదినీవేగా... అరె నీవేగా వెన్నెలని దోచినది నీవేగా... అరె నీవేగా వయసు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం చరణం : 1 పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2) పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్నా మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా ॥చందురుని॥ చరణం : 2 రమ్మనే పిలుపువిని రేగుతోంది యవ్వనమే ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల అలిగిన మగతనమే పగబడితే వీడదే ॥చందురుని॥
0 comments:
Post a Comment