Sunday, July 19, 2020

Raja » Edo Oka Raagam      రాజా » ఏదో ఒకరాగం

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Edo Oka Raagam / ఏదో ఒకరాగం

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Club & Item Songs
EdO okaraagaM pilichiMdIvELaa 
naalO niduriMchE gatamaMtaa kadilElaa
EdO okaraagaM pilichiMdIvELaa
naalO niduriMchE gatamaMtaa kadilElaa
naachUpula daarulalO chirudivvelu veligElaa
naa Upiri UyalalO chirunavvulu chilikElaa
j~jaapakaale maimarapU j~jaapakaale mElukolupU
j~jaapakaale niTTUrpU j~jaapakaale OdaarpU
EdO okaraagaM pilichiMdIvELaa 
naalO niduriMchE gatamaMtaa kadilElaa



 
ammaa ani pilichE toli palukulu j~jaapakamE
raa ammaa ani ammE laaliMchina j~jaapakamE
amma kaLLalO apuDapuDU chemariMtalu j~jaapakamE
amma chIranE chuTTE paata j~jaapakaM
amma navvitE puTTE siggu j~jaapakaM



EdO okaraagaM pilichiMdIvELaa
naalO niduriMchE gatamaMtaa kadilElaa



guLLO kathaviMTU niduriMchina j~jaapakamE
baLLO chaduveMtO bediriMchina j~jaapakamE
gavvalu ennO saMpaadiMchina garvaM j~jaapakamE
nemali kaLLanE daachE chOTu j~jaapakaM
jaamapaLLanE dOchE tOTa j~jaapakaM



EdO okaraagaM pilichiMdIvELaa
naalO niduriMchE gatamaMtaa kadilElaa
naachUpula daarulalO chirudivvelu veligElaa
naa Upiri UyalalO chirunavvulu chilikElaa
j~jaapakalE maimarapU j~jaapakalE mElukolupU
j~jaapakale niTTUrpU j~jaapakale OdaarpU
EdO okaraagaM pilichiMdIvELaa 
naalO niduriMchE gatamaMtaa kadilElaa
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలె మైమరపూ జ్ఞాపకాలె మేలుకొలుపూ
జ్ఞాపకాలె నిట్టూర్పూ జ్ఞాపకాలె ఓదార్పూ
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
నాలో నిదురించే గతమంతా కదిలేలా






అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాత జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం



ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా



గుళ్ళో కథవింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్ళనే దోచే తోట జ్ఞాపకం



ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకలే మైమరపూ జ్ఞాపకలే మేలుకొలుపూ
జ్ఞాపకలె నిట్టూర్పూ జ్ఞాపకలె ఓదార్పూ
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా 
నాలో నిదురించే గతమంతా కదిలేలా

0 comments:

Post a Comment