Tuesday, July 28, 2020

Raakshasudu » Malli Malli      రాక్షసుడు » మళ్ళి మళ్ళి

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Malli Malli / మళ్ళి మళ్ళి

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
maLLi maLLi idi raani rOju.. malli jaaji allukunna rOju..
jaabilaMTi I cinnadaanni .. cUDakuMTE naaku vennelEdi??
 
EdO aDagaalani,
eMtO ceppaalani,
ragilE aaraaTaMlO..veLLalEnu..uMDalEnu..Emi kaanU??
 
maLLi maLLi idi raani rOju.. 
malli jaaji allukunna rOju..
 
cEruvaina raayabaaraalE, ceppabOtE maaTa maunaM..
dUramaina prEma dhyaanaalE, paaDalEni bhaava gItaM..
 
eMDallO vennellO eMcEtO,
okkaraM iddaraM avutunnaaM
 
vasaMtaalu ennostunnaa,kOkilamma kaburEdi??
gunnamaavi virabustunnaa, tOTa maali jaaDEdi??
naa edE tummedai sannidhE cEragaa!!
 
maLLi maLLi idi raani rOju..
malli jaaji allukunna rOju..
 
 
kaLLaniMDaa nIli swapnaalE, mOyalEni viMta mOhaM..
dEhamuna lEvu praaNaalE, nIvu kaadaa naaku praaNaM??
 
saMdiTlO I moggE pUyanI..raagaalE buggallO daayanI..
 
gulaabIlu pUyistunnaa..tEneTIga atithEDi??
saMdemabbulennostunnaa..swaati cinuku taDupEdi??
rEvulO naavalaa nI jatE kOragaa!!
 
jaabilaMTi I cinnadaanni .. cUDakuMTE naaku vennelEdi??
 
EdO aDagaalani,
eMtO ceppaalani,
ragilE aaraaTaMlO..veLLalEnu..uMDalEnu..Emi kaanU??
 
maLLi maLLi idi raani rOju.. 
malli jaaji allukunna rOju..
 
laala laala lala laalalala
Uhu Uhu..Aha aha ahaa..
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు..
జాబిలంటి ఈ చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది??
 
ఏదో అడగాలని,
ఎంతో చెప్పాలని,
రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ??
 
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. 
మల్లి జాజి అల్లుకున్న రోజు..
 
చేరువైన రాయబారాలే, చెప్పబోతే మాట మౌనం..
దూరమైన ప్రేమ ధ్యానాలే, పాడలేని భావ గీతం..
 
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో,
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
 
వసంతాలు ఎన్నొస్తున్నా,కోకిలమ్మ కబురేది??
గున్నమావి విరబుస్తున్నా, తోట మాలి జాడేది??
నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా!!
 
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు..
మల్లి జాజి అల్లుకున్న రోజు..
 
 
కళ్ళనిండా నీలి స్వప్నాలే, మోయలేని వింత మోహం..
దేహమున లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం??
 
సందిట్లో ఈ మొగ్గే పూయనీ..రాగాలే బుగ్గల్లో దాయనీ..
 
గులాబీలు పూయిస్తున్నా..తేనెటీగ అతిథేడి??
సందెమబ్బులెన్నొస్తున్నా..స్వాతి చినుకు తడుపేది??
రేవులో నావలా నీ జతే కోరగా!!
 
జాబిలంటి ఈ చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది??
 
ఏదో అడగాలని,
ఎంతో చెప్పాలని,
రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ??
 
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. 
మల్లి జాజి అల్లుకున్న రోజు..
 
లాల లాల లల లాలలల
ఊహు ఊహు..ఆహ అహ అహా..

0 comments:

Post a Comment